టాన్ టెక్స్ సూపర్ సింగర్
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో లక్ష్మి సూరిబొట్ల చిన్నారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మ్యూజికల్ ఆల్బమ్ ను ప్రముఖ సినీ సంగీత నేపథ్య సంగీత దర్శకుడు సాలూరి కోటి ఆవిష్కరించి, తొలి కాపీని తానా కార్యదర్శి ప్రసాద్ తోటకూరకు అందజేశారు.
'ఎంతో ప్రతిభ గల గాయనీ గాయకులు డల్లాస్ ఉన్నారని, వీరిని చూస్తే నాకు ఎనలేని ఆశ్చర్యం ఆనందం కలుగుతోంది. సినీ నేపథ్య గానంలో అవకాశాలు దక్కించుకునేందుకు ఈ వేదిక వీరందరికీ ఓ చక్కని సదవకాశం కాగలదు. అమెరికాలో తొలిసారిగా నిర్వహించిన ఇంత అద్భుతమైన పాటల పోటీకి న్యాయనిర్ణేతల్లో ఒకడిని అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నేను ఇచ్చిన సలహాలను స్వీకరించి, ఈ 26 మంది గాయనీ గాయకులు భవిష్యత్ లో చక్కగా రాణించాల'ని కోటి ఈ సందర్భంగా అభినందించారు.
పోటీలు నిర్వహించిన ఆడిటోరియం కిక్కిరిసిపోగా బయట కూడా అనేక మంది ప్రేక్షకులు, అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 350 మందికి పైగా ప్రేక్షకులు హాజరైన ఈ కార్యక్రమంలో టాన్ టెక్స్ అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్ రెడ్డి కొర్సపాటి న్యాయనిర్ణేతలు, పోటీదారులు, ప్రేక్షకులకు ఆహ్వానం పలికారు. ఇలాంటి కార్యక్రమాన్ని అమెరికాలో నిర్వహించడం ఇదే తొలిసారి అని తానా కార్యదర్శి ప్రసాద్ తోటకూర ప్రశంసించారు. ఈ పోటీలో ఫైనల్స్ చేరుకున్న మాధురి చివుకుల, శృజన ఆదూరి షికాగోలో జరిగే 17వ తానా సభల్లో నిర్వహించే ఫైనల్స్ పోటీలో పాల్గొంటారని ప్రకటించారు. అక్కడ నిర్వహించే ప్రధాన పోటీలో మా టీవీ న్యాయ నిర్ణేతలు విజేతలను ఎంపిక చేస్తారన్నారు. న్యాయనిర్ణేతలుగా వచ్చిన ప్రసిద్ధ సినీ సంగీత దర్శకుడు కోటి, సెన్సార్ బోర్డ్ సభ్యుడు వంశీ రామరాజు, స్థానికంగా ప్రసిద్ధుడైన హృద్రోగ నిపుణుడు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆళ్ళ, ప్రముక తెలుగు సినీ నేపథ్య గాయని విజయలక్ష్మిని ప్రేక్షకులకు పరిచయం చేసి, పోటీని ప్రారంభించారు.
ఇండో అమెరికన్ సూపర్ సింగర్ పోటీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో టాన్ టెక్స్ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు వెంకట్ ములుకుట్ల ప్రముఖ పాత్ర వహించారు. టెక్సాస్ ప్రాంతం నుంచి ప్రాథమిక రౌండ్ లో పోటీకి తరలివచ్చిన 26వ మంది గాయనీ గాయకులనూ ఆయన ప్రకటించారు. టాన్ టెక్స్ సంయుక్త కార్యదర్శి సురేష్ మండువ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.
Pages: -1- 2 News Posted: 2 June, 2009
|