న్యూజెర్సీలో నాట్స్ ప్రమోషన్
అమెరికా తెలుగు సంబరాలు ప్రమోషన్ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన ప్రముఖ తెలుగు సినీ నేపధ్య సంగీత దర్శకుడు చక్రి తన పుట్టిన రోజు వేడుకను తన కుటుంబ సభ్యులతో కలిసి నాట్స్ అతిథుల సమక్షంలో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా చక్రి ఆలపించిన 'జగమంత కుటుంబం నాది' సినిమా గీతం ప్రతి ఒక్కరి హృదయాలనూ హృద్యంగా తాకింది. పాట విన్న అతిథులంతా లేచి నిలబడి కరతాళ ధ్వనులతో చక్రికి హర్షం వ్యక్తం చేశారు. ప్రముఖ వెంట్రిలాక్విస్ట్ ప్రసాద్ సనపతి ప్రదర్శించిన 'మాట్లాడే బొమ్మ' కార్యక్రమం ఆహూతులందరినీ కడుపుబ్బ నవ్వించింది. అలనాటి సినీనటి రోజారమణి కూడా ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నారు.
అమెరికా తెలుగు సంబరాలు జాతీయ సలహా మండలి సభ్యులు డాక్టర్ బాబూరావు దొడ్డపనేని, యుగంధరరావు వల్లభనేని, డాక్టర్ మధు కొర్రపాటి ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. నాట్స్ సంస్థ కార్యక్రమాల్లో యువత పాలుపంచుకోవాల్సిన ఆవశ్యకత గురించి వారు ప్రధానంగా ప్రస్తావించారు. ప్రవాసాంధ్ర ప్రముఖులు యుగంధరరావు వల్లభనేని, డాక్టర్ బాబూరావు దొడ్డపనేని, లక్ష్మణరావు కాకర్ల, దాము గేదెల, డాక్టర్ మధు కొర్రపాటి, ధర్మారెడ్డి బొడ్డు, రమణ గన్నె, హరి తుమ్మల తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
అమెరికా తెలుగు సంబరాల ప్రమోషన్ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ డాక్టర్ మధు కొర్రపాటి ధన్యవాదాలు తెలిపారు. జూలైన 2 నుంచి 4 వరకూ ఓర్లాండోలో నిర్వహించనున్న 'అమెరికా తెలుగు సంబరాలు'కు తప్పకుండా హాజరవ్వాలని ప్రతి ఒక్కరినీ ఆహ్వానించారు. యువత, పెద్దలు తెలుగు సంబరాల్లో పాల్గొనేందుకు తమ తమ పేర్లను అత్యధిక సంఖ్యలో నమోదు చేసుకోవడం ద్వారా నాట్స్ సంస్థకు మద్దతు ప్రకటించాలని డాక్టర్ మధు కొర్రపాటి విజ్ఞప్తి చేశారు. అలాగే సంస్థ నిర్వహణ కోసం ఉదారంగా విరాళాలు అందజేయాలని ఆయన అభ్యర్థించారు.
తెలుగు సంబరాల ప్రమోషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సుధీర్ తుమ్మల, రవి పర్వతనేని, ప్రసాద్ వడ్డెల, రమేష్ గంధమనేని, వాసు తుపాకుల, రమేష్ నూతలపాటి, భరత్ అంగడి, రంజిత్ చాగంటి, హరి కొల్లూరు విశేషంగా కృషిచేశారు.
Visit for photos: http://picasaweb.google.com/natsnj
Pages: -1- 2 News Posted: 20 June, 2009
|