'భావి సూపర్ పవర్ భారత్'
సభాసదులంతా లేచి నిలబడి హర్షధ్వానాలు వ్యక్తం చేస్తుండగా ముఖ్య అతిథి ఆనంద్ శర్మను ఐనాక్ అధ్యక్షుడు డాక్టర్ సురీందర్ ఎస్. మల్హోత్రా వేదిక మీదికి దగ్గరుండి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమం ఆద్యంతమూ మహేష్ సలాది వ్యాఖ్యాతగా తనదైన శైలిలో నిర్వహించి రక్తికట్టించారు. శ్రీమతి గుల్షన్ మల్హోత్రా, ఇతర ఐనాక్ మహిళా ప్రతినిధులు కేంద్ర మంత్రి ఆనంద్ శర్మను శాలువ కప్పి సన్మానించారు. మోంటే బ్లాంక్ పెన్ ను బహూకరించారు. ఆ పెన్నును వినియోగించిన ప్రతిసారీ ఆనంద్ శర్మ ఐనాక్ ను గుర్తు చేసుకోగలరన్న ఆశాభావాన్ని సంస్థ అధ్యక్షుడు డాక్టర్ మల్హోత్రా వ్యక్తం చేశారు.
భారత జాతీయ గీతం ఆలపించిన అనంతరం కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కరణ్ సింగ్ సతీమణి యశో రాజ్యలక్ష్మి మృతికి సంతాపంగా సభ ఒక నిమిషం మౌనం పాటించింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్థించారు.
సభ ప్రారంభోపన్యాసంలో మహేష్ సలాది ఐనాక్ నిర్వహించిన కార్యక్రమాలు, సాధిస్తున్న విజయాలు, సంస్థ తాజా పరిస్థితి గురించి వివరించారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల ప్రచారానికి ఐనాక్ చేస్తున్న కృషి గురించి తెలిపారు. ప్రజాస్వామ్యం, లౌకిత తత్వం, సౌభ్రాతృత్వం లక్ష్యాల గురించి ఐనాక్ చేస్తున్న ప్రచారం గురించి తెలిపారు. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా భారతీయులందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం లభించేలా చూడవచ్చని మహేష్ సలాది పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల పట్ల దృఢమైన విశ్వాసం గల ఐనాక్ సభ్యులు క్రమేపీ గుడ్ విల్ అంబాసిడర్లుగా ఎదిగి అమెరికాలోనూ, విదేశాల్లోనూ లౌకిక ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నారని ప్రశంసించారు. 2007లో న్యూయార్క్ సందర్శనకు వచ్చిన అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఐనాక్ సంస్థను కాంగ్రెస్ పార్టీకి ఓవర్సీస్ ఎక్స్ టెన్షన్ విభాగంగా ప్రశంసించిన విషయాన్ని మహేష్ సలాది గుర్తు చేశారు. సోనియా గౌరవార్ధం ఐనాక్ నిర్వహించిన ప్రత్యేక విందు కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు.
ఆనంద్ శర్మకు ఐనాక్ నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు డాక్టర్ సురీందర్ ఎస్. మల్హోత్రా మాట్లాడుతూ, భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవం కన్నా ప్రజాస్వామ్య విజయోత్సవం నిర్వహించుకోవడమే పెద్ద విషయం అన్నారు. భారత - అమెరికా అణు ఒప్పందం సందర్భంగా ఐనాక్ తీసుకున్న చొరవ, అనుభవాలను నెమరువేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ లను అభినందించారు.
Pages: -1- 2 News Posted: 23 June, 2009
|