తానా శాశ్వతం: కాకరాల
అలానే, గ్రామాలను దత్తత తీసుకొనే పద్ధతిని కూడా వారు అనుసరిస్తున్నారని ఆయా గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని వివరించారు. అంతే కాకుండా ప్రతిభావంతులైన పేద విద్యార్థులను దత్తత తీసుకొని వారి పోషణ, చదువుకు అయ్యే ఖర్చులను కూడా భరిస్తున్నారని ఆ విద్యార్థి జీవితంలో స్థిరపడే వరకూ సాయం అందిస్తున్నారని కాకరాల చెప్పారు. కాగా, తానా ఆధ్వర్యంలో టీమ్ స్క్వేర్ విభాగాన్ని ప్రారంభించామని ఇది అమెరికాలో చదువుకోవడానికి వచ్చే ఆంధ్ర విద్యార్థుల శ్రేయస్సును పరిశీలిస్తుంటుందని చెప్పారు. విద్యార్థి ప్రమాదవశాత్తు గాయపడినా, అనారోగ్యం పాలైనా ఈ విభాగం వైద్య సహాయం అందజేస్తుందని వివరించారు. దురదృష్టవశాత్తు విద్యార్థి ఎవరైనా మరణించినట్లైతే ఆ మృతదేహాన్ని స్వదేశానికి పంపించడానికి అయ్యే ఖర్చులను ఈ విభాగం ద్వారా తానా భరిస్తుందని ఆయన పేర్కొన్నారు.
సేవ, సంక్షేమ కార్యక్రమాల కోసం విరాళాలను ఇచ్చేవారు నేరుగా తానా ఫౌండేషన్ కు పంపించాలని ఎలాంటి వ్యక్తిగత చెల్లింపులూ చేయవద్దని కాకరాల విజ్ఞప్తి చేశారు. తానా నిధులు అన్నీ ఆంధ్ర రాష్ట్రంలోని కార్యక్రమాలకే కాకుండా అమెరికాలోని తెలుగు విద్యార్థులకు కూడా వివిధ కార్యక్రమాల ద్వారా ఖర్చుచేస్తున్నామని ఈ నిధుల నుంచి ఒక్క పైసా కూడా దుర్వినియోగం అయ్యే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. గత పరిణామాలను మరిచిపోయి అందరూ ఈ వేడుకలను ఆనందంగా జరుపుకుంటున్నామని ఆయన అన్నారు. తాను పదవులను ఆశించలేదని, 1979లో అమెరికా వచ్చినప్పటి నుంచి తనకు తానాతో బాందవ్యం ఉందని కాకరాల వివరించారు. తన బంధువులు, సోదరులు కూడా తానాలో చురుగ్గా పాల్గొనేవారని తన సమీప బంధువు చంద్రశేఖర్ కాకరాల గతంలో తానా అధ్యక్షుడిగా పనిచేశారని ఆయన గుర్తు చేశారు. తానాను సవ్యంగా నడపాలన్నదే తన ధ్యేయమని చెప్పారు. తానా ఎప్పటికీ సుస్థిరంగా, శాశ్వతంగా ఉంటుందని అమెరికా తెలుగువారి ఐక్యతను కాపాడుతూనే ఉంటుందని ఆయన అత్యంత విశ్వాసాన్ని వక్తం చేశారు.
Pages: -1- 2 News Posted: 4 July, 2009
|