ఆంధ్రా జ్యోతిబసు వైఎస్సార్
ఈ సందర్భంగా యువసేన కార్యకర్తలను ఉద్దేశించి కమిటీ అధ్యక్షుడు బొంతు నాగిరెడ్డి ప్రసంగించారు. వైఎస్ రాజశేఖరరెడ్డిలో ఉన్న కష్టించి పనిచేసే తత్వం, చిత్తశుద్ధి, నిబద్ధత, మాట మీద నిలబడడం, చిన్న నాటి నుంచి తనను నమ్ముకున్న వారిని రక్షించే గుణం, పేదలను ఆదుకోవాలన్న అభిమతం తదితర మంచి నాయకత్వ లక్షణాలే ప్రపంచ వ్యాప్తంగా మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కు కోట్లాది మంది అభిమానులను సంపాదించిపెట్టాయని వివరించారు. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు, వైఎస్సార్ ల పుట్టిన రోజు ఒక్కటే కావడం కాకతాళీయం అన్నారు.
ఈ సందర్భంగా వైఎస్సార్ యువసేన యుఎస్ కమిటీ ఉపాధ్యక్షుడు టి. శివనారాయణరెడ్డి మాట్లాడుతూ, ఆహూతుల హర్షధ్వానాల మధ్య వైఎస్ రాజశేఖరరెడ్డిని 'ఆంధ్రా జ్యోతిబసు'గా ప్రకటించారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి సంబంధించి ఎక్కడ ఏ కార్యక్రమం తలపెట్టినా అది అమెరికాలో కాని, ఆంధ్రలో కానీ వర్షాలు కురుస్తుండడం హర్షణీయం అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి వరుణదేవుడు నిజంగా మంచి మిత్రుడు కావడం వల్లనే ఇలా జరుగుతోందని అభివర్ణించారు. సంస్థ ప్రధాన కార్యదర్శి చింపుల శ్రీధర్, డాక్టర్ సామ్ కేసరి, విపిన్ ముప్పిడి తదితరులు ప్రసంగించారు.
అనంతరం అతిథులందరికీ వైఎస్సార్ యువసేన యుఎస్ కమిటీ మంచి రుచికరమైన భోజనం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న 125 మందికి పైగా తెలుగు వారు తమ తమ కుటుంబాలతో హాజరయ్యారు. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిచినందుకు అతిథులంతా వైఎస్సార్ యువసేన కమిటీ సభ్యులను అభినందించారు. 'వైఎస్సార్ జయహో' అంటూ అందరూ ఒక్కసారిగా నినదించారు. వైఎస్సార్ యువసేన మీడియా కార్యదర్శి పాల భానోజీరెడ్డి వందన సమర్పణ చేశారు.
Pages: -1- 2 News Posted: 13 July, 2009
|