'ఘంటా' అభినందన సభ
ఆంధ్ర్రప్రదేశ్ నుంచి అతిథులు ఎవరు అమెరికా వచ్చినా తామంతా కలిసికట్టుగా ఆదరిస్తామని, అదే తమ మధ్య ఉన్న సమైక్యత అని తానా ప్రాంతీయ ఉపాధ్యక్షుడు వాసుదేవరెడ్డి పేర్కొన్నారు. ఆటా సంస్థ నుంచి మహేందర్ ముసుకు ఈ కార్యక్రమానికి హాజరయ్యారని తమదంతా ఒకే లక్ష్యం అన్నారు. అనంతరం తోట రవి తనదైన శైలిలో హాస్య చలోక్తులతో అతిధులందరినీ ఆనంద డోలికల్లో ఓలలాడించారు. వడ్లపట్ల రంజన్ కూడా సభా వేదిక నుంచి ప్రసంగించారు.
ఈ కార్యక్రమం ప్రారంభించడానికి ముందు ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి మైఖేల్ జాక్సన్ పాటలు, అమెరికా అధ్యక్షుడు ఒబామాను అనుకరిస్తూ మాట్లాడి అందరినీ కడుపుబ్బ నవ్వించారు. ఆయన పాడిన పద్యాలతో ఆహూతులంతా ఆనందంలో మునిగితేలారు.
చివరిగా సన్మానితుడు ఘంటా శ్రీనివాసరావుకు గనగోని శ్రీనివాస్, రంజన్ వడ్లపట్ల, దాము గేదల, తనికెళ్ళ భరణి శాలువ కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి, సన్మానపత్రాన్ని ప్రదానం చేశారు. సన్మానపత్రాన్ని తనికెళ్ళ భరణి చదివి వినిపించారు. వంశీ కొప్పురవారి, మహేందర్ ముసుకు, తోట రవి, వాసుదేవరెడ్డి, సోమనాథరావు, అరుణ్, కృష్ణ, కమలాకర్ బోగ, ధన్నపునేని రవి, డాక్టర్ శ్రీనివాసరావు, గోపి తాపీ, దీపక్ పరవెళ్ళ, పలువురు ప్రవాసాంధ్ర ప్రముఖులు ఈ సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు. గనగోని శ్రీనివాస్ నేతృత్వంలో, గేదల దాము పర్యవేక్షణలో, తనికెళ్ళ భరణి సమక్షంలో వైభవంగా శ్రీనివాసరావు సన్మాన కార్యక్రమం జరిగింది.
Pages: -1- 2 News Posted: 14 July, 2009
|