'విశ్వాసానికి ప్రతీక వైఎస్'
క్రిస్టపాటి రమణారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలో కూడా బలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రాష్ట్రం నుంచి ౩౩ మంది లోక్ సభ సభ్యులను ఓటు వేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పార్లమెంటుకు పంపించారని పంపారన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రూపొందించి, అమలు చేస్తున్న వివధ పథకాలను రమణారెడ్డి గేయంగా కూర్చిపాడారు.
ప్రసిద్ధ అవధానులు మేడసాని మోహన్, రాళ్లబండి కవితా ప్రసాద్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కృషి వల్లనే తెలుగు భాషకు అంతర్జాతీయ ప్రాచీనభాషగా హోదా, గుర్తిపు లభించిందని అన్నారు. తెలుగు భాషను ముఖ్యమంత్రి ఎంతగానో ప్రోత్సహిస్తున్నారన్నారు.
సభలో అనేక మంది తెలుగు ప్రముఖులు కరుణాకర్ రావు కలువల, టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షుడు కొర్సపాటి శ్రీధర్ రెడ్డి, కార్యవర్గం, ఎన్ ఎంఎస్ రెడ్డి, వెంకట్, సురేష్ మండువ, అనంత్, వెంకట్ ములుకుంట్ల పాల్గొన్నారు. ప్రసిద్ధ సినీనటులు, సాంఘిక, జానపద రచయితలు, ప్రజాకవులైన గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, గొల్లపూడి మరుతీరావు, అందెశ్రీ, అక్కిరాజు సుందర రామకృష్ణ, అవధానులు మేడసాని మోహన్, రాళ్లబండి కవితాప్రసాద్ పాల్గొన్నారు. వివిధ రకల కవితలు, మూస, సీస, జానపద పద్యాలతో, గీతాలతో అతిథులందరూ ఆహూతులను ఎంతగానో అలరించారు.
కార్యక్రమం చివరిలో 'జయహో వైస్సార్' అంటూ ఆయన పుట్టిన రోజు కోసం ప్రత్యేకంగా చేయించిన కేకును కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ప్రసిద్ధ సినీ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన జయహో గీతాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి హాజరైన టెక్సాస్ తెలుగు సంఘం నిర్వాహకులకు, అతిథులు, రచయితలు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులకు, పసంద్ రెస్టారెంట్ యజమాని ఫకీర్ రెడ్డికి టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షుడు కొర్సపాటి శ్రీధర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
Pages: -1- 2 News Posted: 15 July, 2009
|