న్యూయార్క్ లో వైఎస్ బర్త్ డే
చిన్నబాబు రెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒంటిచేత్తో విజయతీరాలకు నడిపించి, ముఖ్యమంత్రి అయినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కేంద్రంలో కాంగ్రెస్ విజయం సాధించినందుకు మరింత సంతోషంగా ఉందని చెప్పారు.
వెంకటేష్ ముత్యాల మాట్లాడుతూ, రైతు బాంధవుడు, అపర భగీరథుడు, జలయజ్ఞ ప్రదాత అని వైఎస్ రాజశేఖరరెడ్డిని ప్రశంసించారు. విక్రం జంగా మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ, ఇందిరా గృహ పథకం, పావలావడ్డీ పథకాలు పేద ప్రజలకు వరాలు అని చెప్పారు. సురేష్ రెడ్డి సదిపిరల్ల మాట్లాడుతూ, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సుస్థిర పాలన ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రజలు ౩౩ మంది ఎంపీలను గెలిపించారని, జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందిన రాజయకీయ నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి అని ప్రశంసించారు.
జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖరరెడ్డి కృషి వల్లనే తెలుగు భాషకు అంతర్జాతీయ ప్రాచీనభాషగా హోదా, గుర్తిపు వచ్చిందని అన్నారు. నాగభూషణ్ రెడ్డి గీధర మాట్లాడుతూ, ఉత్కంఠగా సాగిన ఎన్నికల పోరులో రాజశేఖరరెడ్డి ఒంటిచేత్తో కాంగ్రెస్ ను విజయతీరాలకు నడిపించారంటే, జనం ఆయన మీద పెట్టుకున్న నమ్మకమే ప్రధాన కారణం అన్నారు. ధరణీధర్ మల్లు మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి సామాన్య ప్రజల్లో వ్యతిరేకత లేదన్న వాస్తవం ఎన్నికల ఫలితాల్లో బయటపడిందన్నారు. లింగారెడ్డి ద్యాప తదితరులు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.
Pages: -1- 2 News Posted: 15 July, 2009
|