జలాశయాలు కళకళ
కర్నాటకలోని హోస్పేట్ వద్ద ఉన్న తుంగభద్ర డ్యాం వరదనీటితో పూర్తిగా నిండిపోయింది. దాంతో సోమవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో తుంగభద్రడ్యాం 10 క్రష్ గేట్లు ఒకటిన్నర అడుగల మేర ఎత్తి 25వేల క్యూసెక్కుల వరద నీటిని తుంగభద్రనది దిగువ ప్రాంతానికి వదిలినట్లు తుంగభద్ర బోర్డు కార్యదర్శి ఎల్ ఎవి నాథన్, చీఫ్ ఇంజనీర్ నంజప్ప, ఎస్.ఇ జయరామిరెడ్డి తెలిపారు. తుంగభద్ర గేట్లు ఎత్తుతున్నట్లు కర్నూలు జిల్లా ఆదోని ఆర్డీవో కార్యాలయానికి ఫ్యాక్స్ ద్వారా తుంగభద్ర బోర్డు అధికారులు సమాచారాన్ని అందించారు. దాంతో తుంగభద్ర నదీపరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగాఉంచాలని కౌతాళం, కోసిగి, మంత్రాలయం, నందవరం మండాలల తహశీల్దార్లకు ఆర్డీఓ వేణుగోపాల్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
తుంగభద్ర డ్యాం నీటి సామర్థ్యం 1633 అడుగులుకాగ, సోమవారం సాయంత్రం 1630 అడుగలకు వరదనీరు చేరి 93టిఎంసీల నీరు డ్యాంలోనిల్వ ఉంది. దీంతో అధికారులు తుంగభద్ర డ్యాం 10 గేట్లు ఎత్తి 25వేల క్యూసెక్కుల నీరు తుంగభద్రనదికి వదిలారు. లక్షా 50వేల క్యూసెక్కుల వరద నీరు డ్యాంలోకి వచ్చి చేరుతోంది. అలాగే 2వేల 809 క్యూసెక్కుల నీటీని డ్యాం నుంచి తుంగభద్ర దిగువ కాల్వ, ఎగువ కాల్వలకు వదులుతున్నారు. ఇలాగే డ్యాంకు ఇన్ ఫ్లో కొనసాగితే మరికొంత నీటిని విడుదల చేయడానికి తుంగభద్ర బోర్డు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తుంగభద్రనదికి నీరు విడుదల కావడంతో నదీపరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
Pages: -1- 2 News Posted: 21 July, 2009
|