మైమరపించిన కీరవాణి
సంగీత విభావరి కార్యక్రమాన్ని వేదిక నుంచి నిర్వహించిన ఉదయభాను కీరవాణి గురించి పరిచయం చేస్తూ, ఆయన 199 సినిమాలకు నేపథ్య సంగీతం అందించారని ఆహూతుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. వినయ విధేయతలతో, నెమ్మదైన స్వభావం గల కీరవాణి కూడా సంగీత ప్రేమికులతో కాస్సేపు వేదిక నుంచే ముచ్చటించారు. క్లాస్, మాస్, ఫ్యామిలీ ఓరియెంటెడ్ అనే తేడా లేకుండా తాను అందించిన సంగీత బాణీలను ఆశీర్వదిస్తున్న ప్రేక్షకదేవుళ్ళకే తన ఖ్యాతి అంతా దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. మొన్నటి 'సీతారామయ్యగారి మనవరాలు' సినిమా మొదలు ఈ నాటి 'మగధీర' వరకూ 'పెళ్ళి సందడి', 'సింహాద్రి', 'గంగోత్రి', 'ఛత్రపతి', 'విక్రమార్కుడు', 'యమదొంగ' మరీ ముఖ్యంగా 'అన్నమయ్య', 'శ్రీరామదాసు' చిత్రాలకు కీరవాణి అందించిన నేపథ్య సంగీతం తెలుగు సంగీత ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. 'బంగారు కోడిపెట్ట' పాటకు నోయెల్ సేన్ చేసిన డ్యాన్స్ కు ప్రేక్షకులంతా ఈలలు, చప్పట్లతో థియేటర్ లో చేసిన సందడి చెప్పనలవికాదు. స్థానికంగా ఉన్న మధు తన డ్యాన్స్ బృందంతో ఈ విభావరిలోని పాటలకు డ్యాన్స్ లతో అలరించారు.
కీరవాణిని, ఉదయభానును, న్యూజెర్సీ అసెంబ్లీ మేన్ ఉపేంద్ర చివుకులను విజయ్ రెడ్డి, సుబ్బరాజు, రవి మాదల సన్మానించారు.
న్యూజెర్సీ అసెంబ్లీ మేన్ ఉపేంద్ర చివుకుల, సుబ్బరాజు ఇందుకూరి, నాట్స్ చైర్మన్ డాక్టర్ రణకుమార్ నాదెళ్ళ, నాట్స్ ప్రెసిడెంట్ రవీంద్ర మాదల, ఆటా బోర్డు ట్రస్తీ రాజేశ్వర్ రెడ్డి గంగసాని, టిఎఫ్ఎఎస్ ప్రెసిడెంట్ దాము గేదల, టిఎల్ సిఎ ప్రెసిడెంట్ వెంకట్ ముత్యాల, నాట్స్ ఫండింగ్ మెంబర్ హరనాథ్ దొడ్డపనేని, యుటిఎఎ ప్రెసిడెంట్ ధర్మారెడ్డి, టిఎజిడివి సంయుక్త కార్యదర్శి లలితా శెట్టి, డాక్టర్ ప్రసాద్, సతీష్ దాసరి తదితర తెలుగు ప్రముఖులు, స్థానికంగా వ్యాపారంలో ప్రసిద్ధులైన డాక్టర్ దేసు గంగాధర్ కార్యక్రమ నిర్వాహకులు విజయ్ రెడ్డి, గణేశ్ ఇందుకూరి, రవి మాదలను అభినందించారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో విశేష సేవలందించిన వలంటీర్లు కిశోర్, చంద్రరాజు, సురేశ్, అనిల్, రహీం, ఫణి, శ్రీని, పాండు, రవికిశోర్, ప్రకాశ్, తిరుమల్ రెడ్డి, హింగె నాగేశ్వరరావు, రాజా అగ్నిహోత్రి, శ్రీనివాసరావు, ప్రతాప్ రిక్కా, నాగిరెడ్డి కర్ణ, రామకృష్ణన్ గురువారెడ్డిలకు విజయ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కీరవాణి బృందానికి చక్కని ఆంధ్రా విందుభోజనం సమకూర్చిన అభిరుచి రెస్టారెంట్ యజమాని రామశేషయ్యకు కార్యక్రమ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. అన్ని విధాలా సహాయ సహకారాలు అందించిన నాట్స్, టాలీ టు హాలీ ఫిల్మ్స్ సంస్థలకు, మీడియాకు విజయ్ రెడ్డి కృతజ్ఞతలు అందజేశారు.
Pages: -1- 2 News Posted: 28 July, 2009
|