'ఏక్ షామ్ సాయి కే నామ్'
అత్యున్నత ఆధ్యాత్మిక విలువలున్న సద్గురువుగా షిరిడీ సాయిబాబాకు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం ఉంది. భారతదేశంలోనూ, విదేశాల్లోనూ బాబాకు లక్షలాది మంది భక్తులున్నారు. మత సహనాన్ని, విశ్వ సోదరభావాన్ని, పరస్పర ప్రేమను, మానవుల మధ్య సహాయ సహకారాలు, ఇతరుల సంస్కృతి పట్ల గౌరవం ఉండాలని సాయిబాబా బోధించారు. అన్ని మతాల సారాన్ని సాయిబాబా ఔపోసన పట్టారు. ప్రతి ఒక్కరిలో మానవత్వం ఉండాలని బోధించిన సాయిబాబా స్వయంగా ఆచరించి చూపించారు. సాయిబాబా ఏ పని చేసినా దానిలో ప్రధానంగా ప్రేమ, త్యాగాలను అనుసరించారు. ఆచరించారు. వాటినే ఇతరులకు బోధించారు. 'సబ్ కా మాలిక్ ఏక్ హై' అంటే అందరి భగవంతుడూ ఒక్కడే అన్నది సాయిబాబా ప్రగాఢ విశ్వాసం. ఆకలిగొన్నవారికి సాయి అన్నం పెట్టాడు. రోగులకు నివారణ కోసం ఔషధాలిచ్చాడు. నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాడు. భక్తులందరని సాయిబాబా కన్న బిడ్డల్లా చూసుకున్నాడు. అలాంటి సాయిబాబా ప్రేమకు భక్తులు పాత్రులు కావాలని అజయ్ గంటి ఆహ్వానించారు.
ఆలయ ప్రాంగణంలో నిర్వహించే ఈ వేడుకల్లో పాల్గొనాలని అజయ్ గంటి అందరికీ ఆహ్వానం పలికారు. ఆలయం ఎదురుగా ఉన్న ప్రదేశంలో వాహనాల పార్కింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. సాయి ఆలయం వార్షికోత్సవంలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ప్రవేశ రుసుమూ లేదని ఆయన ప్రకటించారు. ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు స్వామివారి ప్రసాదం అందజేస్తామన్నారు. ఇతర వివరాల కోసం Shri Shirdi Sai Temple Chicago in Hampshire, IL by phone at 847-931-4058, on the web at www.saibaba.org or by email at maildrop@saibaba.org.లో సంప్రతించవచ్చు.
Pages: -1- 2 News Posted: 14 August, 2009
|