నవ్వుల రారాజుకు నివాళి

ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి, మోపిదేవి వెంకటరమణ, శ్రీధర్ బాబు, దానం నాగేందర్, రఘువీరారెడ్డి తదితర పలువురు రాష్ట్ర మంత్రులు, ఎం.పి.లు మధు యాష్కి గౌడ్, ఉండవల్లి అరుణ్ కుమార్, రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యే , సినీనటి జయసుధ, ఎమ్మెల్సీ రుద్రరాజు, ఎన్. రామచంద్రరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైఎస్సార్ తో తమకు గల అనుబంధాన్ని ప్రవాసాంధ్రులకు వివరించారు. టిఎఫ్ఎఎస్ కు చెందిన దాము గేదల, ఆనంద్ పాలూరి, టిఎజిడివికి చెందిన శైలజ అడ్లూరి, నాట్స్ కు చెందిన మధు కొర్రపాటి, ఆటాకు చెందిన అర్జున్ ద్యాప, మోహన్ పటోళ్ళ వైఎస్సార్ అకాల మృతికి తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు.
వైఎస్సార్ కు నివాళులు అర్పించేందుకు వచ్చిన వందలాది మంది ప్రవాసాంధ్రులతో రాయల్ అల్బెర్ట్ ప్యాలస్ కిక్కిరిసిపోయింది. నవ్వుల రారాజు వైఎస్సార్ కు గుర్తుగా ఈ సంస్మరణ సభలో కొవ్వుత్తులు వెలిగించి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. సంతాప సందేశం కోసం వేదిక వద్ద ఏర్పాటు చేసిన పుస్తకంలో ప్రతి ఒక్కరూ సంతకాలు చేశారు.

సంతాపసభకు హాజరైన వారికి నాట్స్ కు చెందిన విజయ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. వేదికను ఉచితంగా సమకూర్చిన రాయల్ ఆల్బెర్ట్ ప్యాలెస్ యజమాని ఆల్బెర్ట్ జస్సానీకి ఆయన ధన్యవాదాలు చెప్పారు. సంస్మరణ సభకు హాజరైన అందరికీ ఉచితంగా రుచికరమైన శాఖాహార భోజనం ఏర్పాటు చేసిన అభిరుచి రెస్టారెంట్ యజమాని రామశేషయ్య, దక్షిణ్ రెస్టారెంట్ ప్రొప్రయిటర్ సతీష్ దాసరి, కోరియాండర్ యజమాని దాము గేదల, హైదరాబాద్ బిర్యానీ ప్రొప్రయిటర్ కృష్ణారెడ్డి, ప్యారడైజ్ బిర్యానీకి చెందిన రాజ్, గుణ, సప్తగిరికి చెందిన వినయ్, బాబా హట్ యజమాని, సినిమా నటుడు ప్రదీప్ శక్తి, విలేజ్ కు చెందిన ప్రజ్ఞేశ్ పటేల్ కు విజయ్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. వైఎస్సార్ సంస్మరణ సభ నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించిన రమణ గన్నె, కార్యక్రమ నిర్వహణలో పూర్తి తోడ్పాటు అందించిన రణధీర్ ఠాకూర్, నందు యాష్కి, సుధీర్ పాకలపాటి, నరేందర్ రెడ్డి యాస, శ్రీనివాస్ అరికట్ల, శ్రీనివాస్ దగ్గుబాటి, బ్రహ్మాజీ వలివేటి, విజయ్ బండ్ల, యోగేశ్ పాటిల్, ఆనంద్ పాలూరి, శంకర్ లహరి, ఎస్ఎస్ రెడ్డి, రవి హజీబు, శ్రీనివాస్ గనగోని, శ్రీకాంత్ గుడిపాటి, శ్రీనాథ్ ధూళిపాళ్ళ, జితేంద్ర అట్లూరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు లాంటి పలువురు ప్రముఖుల నుంచి ఈ సంస్మరణ సభకు లైవ్ వీడియో ద్వారా సందేశాలు అందజేసిన సుబ్బరాజు ఇందుకూరిని ఆహూతులందరూ అభినందించారు.
Pages: -1- 2 News Posted: 15 September, 2009
|