'మహా నాయకుడు వైఎస్'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుడిగా ఎన్నికైనది మొదలు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ ప్రస్తానం, వ్యక్తిగత జీవితంలోని ప్రధాన ఘట్టాలను డాక్టర్ ఎం.వి. రమణారెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్ పథకాలు, సామాన్యుల జీవితాలకు వాటి ద్వారా చేకూరిన ప్రయోజనాలను వి.సి.ఎస్ రెడ్డి వివరించారు. కల్లం రామ్మోహన రెడ్డి, మధుసూదనరెడ్డి, నారాయణరెడ్డి, రవి మేరెడ్డి, మాధవరెడ్డి, రామ సూర్యారెడ్డి, హరినాధరెడ్డి, నాద ముని రెడ్డి, రవి పొట్లూరి ఈ సంతాపసభలో వైఎస్ తో తమకు గల అనుభవాలను నెమరువేసుకున్నారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి ఎప్పుడూ చెప్పిన హరితాంధ్ర ప్రదేశ్ ఆవిష్కారం కావాలంటే ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిని అప్పగించాల్సిన ఆవశ్యకత గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, కాంగ్లెస్ లెజిస్లేచర్ పార్టీలోని మెజారిటీ అభిమతాన్ని పరిగణనలోకి తీసుకొని కాంగ్రెస్ అధిష్టానం జగన్ నే ముఖ్యమంత్రిగా నియమించాలంటూ విజ్ఞప్తి చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కు నివాళులు అర్పించేందుకు తమ సమయాన్ని వెట్టించి సంస్మరణ సభకు హాజరైన ప్రతి ఒక్కరికీ డాక్టర్ రాఘవరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
Pages: -1- 2 News Posted: 17 September, 2009
|