మేరీ పాలెంటీ సంతాపం

ట్యాన్ టెక్స్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీధర్ కొర్సపాటి సభకు స్వాగతం పలికారు. ఐఎఎఫ్ సి ప్రధాన కార్యదర్శి ప్రసాద్ తోటకూర ముఖ్యఅతిథి మేరీ పాలెంటీని సభకు పరిచయం చేశారు. ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ నాయకులు ఐఎఎన్ టి ప్రెసిడెంట్ అక్రం సయద్, ట్యాన్ టెక్స్ ప్రెసిడెంట్ (ఎలెక్ట్) చంద్ర కన్నెగంటి, ఆ సంస్థ కార్యదర్శిగీత దమ్మన్న, ఎఎఫ్ సి కోశాధికారి డాక్టర్ సి.ఆర్. రావు, తానా సౌత్ వెస్ట్ ప్రాంతీయ డైరెక్టర్ మురళి వెన్నంలు ముఖ్యఅతిథి మేరీ పాలెంటీ సేవలకు గుర్తుగా శాలువ, పుష్పగుచ్ఛం, జ్ఞాపిక అందజేసి సన్మానించారు.
చిన్నారుల్లో హృద్రోగాల పట్ల పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న మేరీ పాలెంటీకి ఐఎఎఫ్ సి ప్రధాన కార్యదర్శి ప్రసాద్ తోటకూర ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయంలో మేరీ అంకితభావం, నిబద్ధతలను ఆయన కొనియాడారు. మేరీ చేస్తున్న కృషి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ప్రసాద్ తోటకూర హామీ ఇచ్చారు. వేణు రాంపల్లి సభకు వందన సమర్పణ చేశారు. సభకు హాజరైన ముఖ్యఅతిథి మేరీ పాలెంటీకి, అతిథులకు, స్పైస్ ఇన్ రెస్టారెంట్ యాజమాన్యానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Pages: -1- 2 News Posted: 17 September, 2009
|