గుండె తడిపిన 'గోరటి'

తాము తీసుకువచ్చిన బతుకమ్మలను పార్కులో ఒక చోట ఉంచి మహిళలు, చిన్నారులు చుట్టూ తిరుగుతూ 'బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో' అంటూ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాట పాడుతూ ఆడారు. బతుకమ్మ ఆట సజావుగా కొనసాగడానికి విశేషంగా కృషి చేసిన ప్రీతి చల్లా, శిరీష మర్లను నిర్వాహకులు సన్మానించి, అభినందించారు. అనంతరం మహిళలంతా 'పోయి రావమ్మ గౌరమ్మా' అంటూ బతుకమ్మలను నిమజ్జనం చేశారు.
ఈ ఏడాది బతుకమ్మ పండుగ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు చిరకాలం గుర్తుండిపోయేలా ఉన్నాయి. కార్యక్రమంలో పలువురు చిన్నారులు తెలంగాణ జానపద, శాస్త్రీయ, సినిమా పాటలకు డ్యాన్సులు, భక్తి శ్లోకాల ఆలాపన, తెలుగు పాటలు పాడి ఆహూతులందరినీ ఆనందంలో ముంచెత్తారు. రంగురంగుల బతుకమ్మలను చిత్రాలు గీసే పోటీలో పలువురు చిన్నారులు హుషారుగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో విజేతలకు మిర్చి ఇండియన్ కుషన్ సంస్థ అందజేసింది.
డెట్రాయిట్ మెగా బతుకమ్మ పండుగకు నోవిలోని మిర్చి ఇండియన్ కుషన్ ప్రధాన స్పాన్సర్ గా వ్యవహరించింది. ఈ పండుగ విజయవంతం కావడానికి ఉదారంగా విరాళాలు అందజేసిన దాతలు, డెట్రాయిట్ తెలంగాణ వలంటీర్లు రఘు బోడ, ప్రీతి చల్లా, దామోదర్ గంకిడి, అశోక్ పెరుమాండ్ల, ప్రవీణ్ జొన్నలగడ్డ, సునీల్ మర్రి, శ్రీధర్ బండారు, రామ్ రెడ్డి, సిద్ధార్థ్ అన్నెబోయిన, వెంకట్ మంతెన, మురళి బొమ్మనవేని, హరి మారోజు, శైలేంద్ర సానం, నాగేంద్ర ఐతా, రాజు బ్రహ్మాండభేరి తదితరులు విశేషంగా కృషి చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు, విజయవంతం చేసిన నిర్వాహక సంఘానికి, ఈ కార్యక్రమానికి చక్కని ప్రచారం కల్పించిన మాదాడి భరత్ రెడ్డికి, విందును ఏర్పాటు చేసిన మిర్చి సంస్థకు ధన్యవాదాలు తెలపడంతో కార్యక్రమం ముగిసింది.
Pages: -1- 2 News Posted: 22 September, 2009
|