టిసిఎ బతుకమ్మకు ప్రశంసలు

పరిచయ కార్యక్రమం పూర్త కాగానే సంప్రదాయ రీతిలో రేణుక చవ్వ, అనిత పాలబిందెల, గందె నాగజ్యోతి, అనురాధ అలిశెట్టి జ్యోతులు వెలిగించి గౌరీపూజ నిర్వహించి చారిత్రక బతుకమ్మ పండుగను ప్రారంభించారు. పూజానంతరం భాస్కర్ మద్ది, శ్రీమతి ఉమ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. దీనిలో భాగంగా చిన్నారులు తెలంగాణ కోలాటం, కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శించారు. శాంతి, సౌఖ్యాల కోసం బతుకమ్మ ప్రార్ధనలు చేశారు. సాయంత్రం 5.45 గంటలకు మహిళలంతా ఒక చోటకు చేరి బతుకమ్మలను ఉంచి వాటి చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతూ, ఆడారు.
తిరుపతయ్య గందె, నాగజ్యోతి గందె అలంకరించి తీసుకువచ్చిన అతి పెద్ద బతుకమ్మకు ప్రతి ఒక్కరి నుంచీ ప్రశంసల వర్షం కురిసింది. చక్రి, మృత్యుంజయుడు తెలంగాణ డప్పు వాయించారు. డప్పు వాయిద్యాలు, కోలాటాల సందడితో పార్క్ మొత్తం పండుగ కళతో నిండిపోయింది. పండుగ సంబరాలు సజావుగా కొనసాగేలా టిసిఎ కోర్ మెంబర్ ప్రసాద్ గట్టు తీసుకువచ్చిన లోక్ సత్తా సభ్యులు చక్కని సహకారం అందించారు. ఈ సందర్భంగా సిలికానాంధ్ర సంస్థకు చెందిన దిలీప్ కొండిపర్తి, బాటా ప్రెసిడెంట్ ప్రసాద్ మంగిన, ఆటా ప్రాంతీయ వైస్ ప్రెసిడెంట్ రణ్ ధీర్ సింగ్, సురేష్ రెడ్డి వుయ్యూరు, ఓవర్సీస్ జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన మోహన్ మైలంపాటి, ప్రజారాజ్యం పార్టీకి చెందిన రామ్ తోట మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

రాత్రి 7 గంటలకు తెలంగాణ సాంప్రదాయ రుచులతో విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ పండుగను విజయవంతంగా నిర్వహించడానికి టిసిఎ వైస్ ప్రెసిడెంట్ అర్షద్ హుస్సేన్, కోశాధికారి భాస్కర్ మద్ది, సైదీష్ అజ్జన్, ప్రసాద్ గట్టు, రమేష్ గుబ్బ, రాజు యాసల, సుభాష్ రావడ, ప్రహ్లాద్ యెలిశెట్టి, మహిపాల్ అన్నం, శ్రీనివాస్ గుజ్జు, గందె తిరుపతయ్య, లక్ష్మీనారాయణ గత నాలుగు నెలలుగా అవిశ్రాంతంగా కృషి చేశారు. టిసిఎ తాజా మాజీ ప్రెసిడెంట్ బుచ్చన్న గాజుల భారతదేశం నుంచి సమన్వయం చేశారు. సైదీష్ వందన సమర్పణ చేశారు. అనంతరం బతుకమ్మ నిమజ్జనం కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బతుకమ్మ పండుగను క్రమశిక్షణతో, సమన్వయంతో విజయవంతంగా నిర్వహించిన తెలంగాణ కల్చలర్ అసోసియేషన్ కార్యనిర్వాహకవర్గాన్ని ప్రతి ఒక్కరూ అభినందించారు.
Pages: -1- 2 News Posted: 23 September, 2009
|