హ్యూస్టన్ లో శ్రీశ్రీ శతజయంతి
అనంతరం ముఖ్యఅతిథి సరోజా శ్రీశ్రీ కీలకోపన్యాసమిస్తూ శ్రీశ్రీతో తన పరిచయం, వివాహం, సంసారం, వారి జీవితంలో కలసి ఎదుర్కొన్న ఒడుదుడుకులు, పంచుకున్న కష్టసుఖాలు వివరించారు. ఈ సందర్భంలో ఆమె ప్రస్తావించిన అంశాలతో ప్రేక్షకుల్లో చాలమంది కన్నీరు కార్చారు.
శ్రీశ్రీ హ్యూస్టన్ 1981లో వచ్చినప్పుడు స్వహస్తాలతో రాసిన సిప్రాలి కవితా సంకలనాన్ని వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా పుస్తకంగా ముద్రించి సరోజా శ్రీశ్రీ చేతుల మీదుగా విడుదల చేశారు. వంగూరి ఫౌండేషన్ నూతన విభాగం 'అమెరికా తెలుగు పుస్తక సమాఖ్య' లాంఛనప్రాయంగా సరోజా శ్రీశ్రీ చేతుల మీదుగా ప్రారంభమైంది.
తరువాత ప్రముఖ గాయని చంద్రకాంత కోర్ట్నీ, ప్రముఖ తబలా వాయిద్య కళాకారుడు డేవిడ్ కోర్ట్నీ దంపతులు శ్రీశ్రీ రాసిన కొన్ని పాతపాటలు పాడి ప్రేక్షకులను ఆహ్లాద పరిచారు. అంజలి సెంటర్ అనిల్ కుమార్, వంగూరి చిట్టెన్ రాజు కృషి వల్ల శ్రీశ్రీ 1981లో హ్యూస్టన్ లో గడిపిన కొన్ని మధురక్షణాలను వీడియోలో హ్యూస్టన్ సాహితీ ప్రియులు తిలకించారు.
తెలుగు సాంస్కృతిక సమితి ట్రస్టీ భాస్కర్ రావు ముత్యాల ముఖ్యఅతిథులను శాలువతో సత్కరించారు. తెలుగు సాంస్కృతిక సమితి అధ్యక్షుడు రామ పాకాల కృతజ్ఞతా ప్రసంగం చేశారు. మయూరి రెస్టారెంట్ సరఫరా చేసిన కమ్మనైన భోజనంతో నెల నెలా తెలుగు వెన్నెల మొదటి వార్షికోత్సవం జయప్రదంగా ముగిసింది.
Pages: -1- 2 News Posted: 23 September, 2009
|