న్యూజెర్సీ బతుకమ్మ పండుగ

మధ్యాహ్న భోజనాల అనంతరం చిన్నారులు, మహిళలు, పురుషుల విభాగాల్లో విడివిడిగా పరుగు పందెం, మహిళల విభాగంలో ఒకరి నుంచి మరొకరికి చేతుల్లోకి బంతిని మార్చడం, స్పూన్ - లెమన్ రేస్ లాంటి పోటీలు ఎంతో స్ఫూర్తివంతంగా జరిగాయి.
సాయంత్రం 4 గంటల నుంచి బతుకమ్మ ఆట ప్రారంభమైంది. మహిళలు సాంప్రదాయ బద్ధంగా ఆకర్షణీయమైన చీరలు ధరించి రంగు రంగుల బతుకమ్మలను రూపొందించి పార్క్ కు తీసుకువచ్చారు. అందరూ తెచ్చిన బతుకమ్మలను ఒక చోట ఉంచి వాటి చుట్టూ తిరిగి సాంప్రదాయ రీతిలో బతుకమ్మ ఆడారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు వేయి కళ్ళయినా సరిపోవని పలువురు అతిథులు ప్రశంసించారు. రెండు గంటల పాటు బతుకమ్మ ఆడిన తరువాత రరిటన్ సరస్సులో బతుకమ్మ పాటలు పాడుతూ నిమజ్జనం చేశారు.
బతుకమ్మ పండుగ చరిత్ర, ప్రాశస్త్యం గురించి ముఖ్యఅతిథి వడ్డేపల్లి కృష్ణ సోదాహరణంగా వివరించారు. పెద్ద బతుకమ్మను రూపొందించి తీసుకువచ్చిన శ్రీమతి సురేఖ యెర్రంకు ఉత్తమ బతుకమ్మ బహుమతిని దిలీప్ కుమార్ ప్రదానం చేశారు. ఆటల పోటీల్లో విజేతలకు వడ్డేపల్లి కృష్ణ బహుమతులు అందజేశారు.
న్యూజెర్సీ బతుకమ్మ పండుగ విజయవంతం కావడానికి నందు యాష్కి, దినకర్ రెడ్డి పాఖాల, వెంకట్రాజం చిలుక, జగదీశ్ గబ్బెట, కిశోర్ భూపతి, రవి పెద్ది, లక్ష్మారెడ్డి కొల్లా, హరిణి నీలగిరి, రజని బిళ్ళకంటి, విద్య వెంకటయోగి, కల్పన సువర్ణ, కృపాలిరెడ్డి బండి, సింధురెడ్డి వెదెర, పల్లవి గంగసాని, భాను మాగంటి, రమ పాతూరు, రాణి వెలిశాల, రేణుక రాంపల్లి, సంగీత ధన్నపునేని, నీలిమ సువర్ణ, అనురాధ వేమూరి, పద్మజ గొలుగుల, లావణ్య భూపతి, నివేదిత మారుపాక, మంజుల గనగోని, అనుపమ ముప్పాల, శ్రీవాణి కుర్మ విశేషంగా కృషి చేశారు. బతుకమ్మ పండుగలో పాల్గొని విజయవంతం చేసిన నిర్వాహకులు, వలంటీర్లు, ఆహూతులు ప్రతి ఒక్కరికీ రమేష్ అవునూర్ కృతజ్ఞతలు తెలిపారు.
Pages: -1- 2 News Posted: 26 September, 2009
|