'తేన' బతుకమ్మ పండుగ

ఈ సందర్భంగా చిన్నారులు, పెద్దల విభాగాల్లో పలు ఆటల పోటీలు నిర్వహించారు. చిన్నారులు, పెద్దలు కూడా మ్యూజికల్ చైర్స్ ఆడగా, చిన్నారుల టగ్ ఆఫ్ వార్, మహిళలు ఆడిన మ్యూజికల్ చైర్స్ ఈ పోటీల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. హారిక & భాస్కర్ బత్తిని, శ్రీనివాస్ ఉప్పల కుటుంబం, స్మిత & సత్య పెద్దిరెడ్డి, కరుణ & రెహ్మాన్, రజని & సంపత్ బిల్లకంటి, నీరజ & సుధీర్ రాజు, శ్రీనివాస్ పబ్బా కుటుంబం, సంగీత & రవి ధన్నపునేని, సౌందర్య & రవి మేరెడ్డి తీసుకువచ్చిన బతుకమ్మలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. రంగురంగుల పూలతో అలంకరించి అతి పెద్ద బతుకమ్మలను తీసుకువచ్చిన మేఘన, వేణు భాస్కర్, హారిక బత్తిని కుటుంబాలకు ప్రత్యేక అభినందనలు దక్కాయి.

బతుకమ్మ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్న నారాయణ్ రెడ్డి, మల్లారెడ్డి, కాశీనాథ్, పార్థసారధి, శ్రీనివాస్ భీమనపల్లి, రవి కందకుర్తి, రవికాంత్, భాస్కర్ బుర్రా కుటుంబాలకు తేన కార్యనిర్వాహకవర్గం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. వెంకట్ కోటు, కమలాకర్ మర్త్యరాజు, రవీందర్ సూదిని, శ్రీనివాస్ భీమనపల్లి, మధు షాకెల్లి, రవి కందకుర్తి, శ్రీకాంత్ రెడ్డి ముదిగంటి, వారి కుటుంబ సభ్యులు ఈ ఉత్సవాలల్లో పాల్గొన్న ప్రముఖుల్లో ఉన్నారు. న్యూజెర్సీ నుంచి ఈ సంబరాల్లో పాల్గొనేందుకు ప్రత్యేకంగా వచ్చిన సంగీత & రవి ధన్నపునేనిలకు నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. భోజన పదార్థాలను స్పాన్సర్ చేసిన బావర్చి రెస్టారెంట్ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు అందజేశారు.
తేన ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించిన బతుకమ్మ సంబరాలకు అనేక మంది వలంటీర్లు తమ సహాయ సహకారాలు అందించారు. ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వహించినందుకు సుధీర్ రాజు, సుభాష్ కర్రా, వేణు బత్తిని, సంపత్ బిల్లకంటి, శ్రీనివాస్ పుబ్బా, భాస్కర్ బుర్రా, మాధవ మోసర్ల, రవి మేరెడ్డి సహా నిర్వాహకులకు అతిథులంతా కృతజ్ఞతలు తెలిపారు.
Pages: -1- 2 News Posted: 30 September, 2009
|