'ప్రవాసాంధ్రులూ శెభాష్'

పురందేశ్వరి మాట్లాడుతూ, కష్టపడి పనిచేసే వారికి అమెరికా 'ల్యాండ్ ఆఫ్ అపార్ట్యునిటీస్' గా భాసిల్లుతోందని అభివర్ణించారు. కష్టపడి పనిచేయడం ద్వారా ప్రతి మహిళ, పురుషుడు చక్కని, సౌకర్యవంతమైన జీవితాలను అనుభవిస్తున్నారని ప్రశంసించారు. ఈ దిశగా భారతీయ మహిళలు ఇంటిలోను, వెలుపల ప్రదర్శిస్తున్న చొరవ, ప్రతిభలను పురందేశ్వరి ప్రశంసార్హమన్నారు. స్త్రీ పురుషులకు భారత దేశంలో సమానావకాశాలున్నప్పటికీ తమ జాతిని, దేశాన్ని బలీయం చేసే కృషిలో భాగంగా రాజకీయాల్లోకి భారతీయ మహిళలు పురుషుల కన్నా తక్కువ సంఖ్యలో వస్తున్నారని ఆమె విచారం వ్యక్తం చేశారు. అనంతరం నిర్వహించిన క్వశ్చన్ అవర్ కార్యక్రమంలో పలువురు అడిగిన ప్రశ్నలకు పురందేశ్వరి తనదైన శైలిలో వివరణాత్మకంగా సమాధానాలిచ్చి అందరినీ ఆనందాశ్చర్యాల్లో ముంచెత్తారు.
చంద్ర కన్నెగంటి వందన సమర్పణతో ముగిసిన ఈ అల్పాహార విందు సమావేశంలో వ్యాపారవేత్తలు షాన్ గఫ్, సీను పొహార్, జెర్రి కెట్రిడ్జ్, ఎంఓ పెర్చ, దయాకర్ పుస్కూర్, జొనాథన్ కిర్క్, సంజయ్ కనటాల, సంతోష్, భాను చౌదరి, సురేష్ గొట్టిముక్కల, రాజన్ అగర్వాల్, సురేష్ మన్యం, చాకో, సోపీ, శాంటె చారి, మనోహర్ జంగేటి, ప్రసిద్ధ వైద్యులు పీటర్ గులాటి, రాజ్ నరేందర్ చొల్లేటి, విజయ్ రెడ్డి, తనూజా రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, సుమన, సుమతి నైని, సంగమేశ్వర్, నళిని, సుమన్, సుధాకర్ రుమాళ్ళ, రాజు కోసూరి, విష్ణు రుమాళ్ళ, స్మిత రుమాళ్ళ, శ్రీపతి, శిరీష, శ్రీనివాస్, వసంత, రమణ జువ్వాడి, డల్లాస్ కు చెందిన ప్రవాసాంధ్ర నాయకులు చంద్ర కన్నెగంటి, మంజుల కన్నెగంటి, పూర్ణచందర్ రావు, లక్ష్మణ్ రావు, ఉమ, భీమ పెంట, కృష్ణారెడ్డి, ఎ.సి.రెడ్డి, సునీతారెడ్డి, శిరీషారెడ్డి, శ్వేతారెడ్డి, సుధారెడ్డి, రమ పాల్గొన్నారు.
Pages: -1- 2 News Posted: 9 October, 2009
|