డల్లాస్ లో బతుకమ్మ సందడి

బతుకమ్మ పండుగ కార్యక్రమాలు ముగిసిన వెనువెంటనే దసరా సంబరాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో అందరూ జమ్మిపూజ, రథయాత్ర నిర్వహించారు. పూజారి జమ్మిపూజ నిర్వహించి, 'శమీ శమయతే పాపం' అంటూ మంత్రోచ్ఛారణ చేశారు. అనంతరం దుర్గామాతకు పూజలు చేశారు. అనంతరం అతిథులందరికీ రుచికరమైన స్నాక్స్, గారెలు, పులిహోర తదితర తెలంగాణ సాంప్రదాయబద్ధమైన విందుభోజనాన్ని ఆరగించారు. ఏక్ నజర్, జనప్రియ, మయూరి రెస్టారెంట్, డిస్కవర్ ట్రావెల్, రెడ్డి న్యూమాన్ పిసి, స్పైస్ ఇన్, రేడియో ఖుషీ, పటేల బ్రదర్స్ లాంటి పలు సంస్థలు, వ్యక్తులు స్పాన్సర్ చేయడంతో భక్తులు, అతిథులందరికీ పూర్తి ఉచితంగా విందు ఏర్పాటు చేశారు.
సాంస్కృతిక అతిథి గోరటి వెంకన్న తనదైన శైలిలో చిరస్మరణీయమైన కార్యక్రమంతో అందరినీ అలరించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చిన్నారులు పాడిన జానపద, భక్తిగీతాలు ఈ కార్యక్రమంలో హై లైట్ గా నిలిచాయి. స్థానిక మహిళలు నిర్వహించిన బతుకమ్మ ఆట, పాట ఆకర్షణగా నిలిచింది. సాంస్కృతిక కార్యక్రమానికి డాక్టర్ కస్తూరి ఇనగంటి, రంజిత్ వెరమాళ్ళ, పవన్ నెల్లుట్ల, వెంకట్ ములకుట్ల, కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.
బతుకమ్మ, దసరా సంబరాలు విజయవంతం చేయడానికి ఎనభై మందికి పైగా వలంటీర్లు అవిశ్రాంతంగా కృషి చేశారు. డిఎఫ్ డబ్ల్యు బతుకమ్మ, దసరా సంబరాలకు స్పాన్సర్లుగా, దాతలుగా, వలంటీర్లుగా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహక కమిటీ సభ్యులు అనంత్ రెడ్డి పజ్జూర్, చంద్ర బండార్, జానకిరాం మందాడి, కల్వల రావు, కరుణాకర్ దాసరి, రామ్ కాసర్ల, రవి వేణిశెట్టి, సతీష్ రెడ్డి, శ్యామ రుమాళ్ళ, శ్రీధర్ కొర్సపాటి, శ్రీనివాస్ గుర్రం, శ్రీనివాస్ కాటూరి ధన్యవాదాలు తెలిపారు.
Pages: -1- 2 News Posted: 10 October, 2009
|