హాంకాంగ్ లో దసరా సరదా

దసరా ఉత్సవాల ప్రారంభ రోజు సెప్టెంబర్ 19 శనివారం నుంచి ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ఒక్కొక్కరి ఇళ్ళల్లో దుర్గాదేవికి ఉత్సవాల నిర్వాహకులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా లలితా సహస్ర నామావళి పారాయణ, భజనలు ఏర్పాటు చేశారు. 20 ఆదివారంనాడు హ్యాపీ వ్యాలీలోని హిందూ దేవాలయంలో సామూహిక పూజా కార్యక్రమం జరిగింది. ఈ సామూహిక పూజలో హాంకాంగ్ లో నివసిస్తున్న ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
విజయ దశమి రోజున 'ఆయుధ పూజ'ను వారి వారి ఇళ్ళల్లో శాస్త్రోక్తంగా, సాంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. అలాగే చిన్నారులకు తెలుగు భాష మాట్లాడడంలో శిక్షణ తరగతులు జరిగాయి. ఈ శిక్షణలో చిన్నారులు తెలుగులో మాట్లాడే విధానం, స్తోత్ర పారాయణం, పద్యాలు పాడడం, కథలు వినడం, తెలుగు అక్షరాలను నేర్పించారు. అలాగే యువ భరతనాట్యాచార్యుడు భరతనాట్యం శిక్షణ తరగతులను కూడా ఈ సందర్భంగా ప్రారంభించారు.
ఈ ఏడాది దసరా ఉత్సవాలకు హాంకాంగ్ లోని తెలుగువారి నుంచి ఊహించని స్థాయిలో పెద్ద ఎత్తున స్పందన లభించింది.
Pages: -1- 2 News Posted: 10 October, 2009
|