వైట్ హౌస్ లో దీపావళి
వేడుకలు జరిగిన వైట్ హౌస్ ఈస్ట్ రూమ్ లో భారతీయ మిఠాయి బాక్సులు ఉంచిన 150 కుర్చీలూ ఆహూతులతో నిండిపోయాయి. ఈస్ట్ రూమ్ లో ఏర్పాటు చేసిన ఒకే ఒక దీపాన్ని ఒబామా కొవ్వొత్తి సహాయంతో వెలిగించారు. శివ - విష్ణు ఆలయం పూజారి నారాయణాచారి ఈ సందర్భంగా ఉపనిషత్తులలోని 'అసతోమా సద్గమయా.. తమసోమా జ్యోతిర్గమయా.. మృత్యోర్మా అమృతం గమయా' శ్లోకాన్ని పఠించారు. ఈస్ట్ రూమ్ లోకి ఒబామా ప్రవేశించిన వెంటనే పూజారి నారాయణాచారి శాలువ కప్పి ఆశీర్వదించారు. హిందూ సాంప్రదాయ దుస్తుల్లోను, నుదుటున తిరునామాలతో వైట్ హౌస్ కు వచ్చిన నారాయణాచారిని అనేక భద్రతా పరీక్షలు నిర్వహించిన అనంతరం లోనికి అనుమతించారు. ఈ విషయం స్వయంగా నారాయణాచారి మీడియాతో చెప్పారు.
'దీపావళి వేడుకల్లో ఒక అమెరికా అధ్యక్షుడు తొలిసారిగా పాల్గొన్నందుకు మీకు ధన్యవాదాలు మిస్టర్ ప్రెసిడెంట్' అంటూ ఒక జర్నలిస్టు అభినందించారు. అనేక అత్యవసర కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ ఒబామా దీపావళి వేడుకల్లో పాల్గొనడం విశేషం.
Pages: -1- 2 News Posted: 15 October, 2009
|