పురందేశ్వరిపై పూలవర్షం!

దీపావళి విశిష్టత గురించి, తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు భారతీయ సంప్రదాయాలకిచ్చే విలువ గురించి, ఆయన నుంచి తాను నేర్చుకున్న అంశాల గురించి, దేవుడిపై ఉన్న విశ్వాసం గురించి ఆకట్టుకునే విధంగా పురందేశ్వరి ప్రసంగించారు. పురందేశ్వరి ప్రసంగాన్ని ఆహూతులందరూ ఎంతో ఆసక్తిగా విన్నారు. ఆమె ప్రసంగానికి ప్రతి ఒక్కరూ కరతాళ ధ్వనులతో హర్షామోదాలు వ్యక్తం చేశారు. పురందేశ్వరితో కలిసి ఫొటోలు దిగేందుకు పోటీలు పడ్డారు. ఈ సందర్భంగా పురందేశ్వరిపై రూపొందించి ప్రదర్శించిన పది నిమిషాల నిడివి గల దృశ్య రూపక లఘు చిత్రం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.

న్యూజెర్సీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఉపేంద్ర చివుకుల మాట్లాడుతూ, గవర్నర్ జాన్ కొల్విన్ ప్రవాసాంధ్రుల పట్ల ప్రదర్శిస్తున్న ఆత్మీయతను ప్రశంసించారు. న్యూజెర్సీలోని తెలుగువారు ఎప్పుడు, ఏ కార్యక్రమం నిర్వహించినా పిలిచిన వెంటనే హాజరవడం ముదావహం అని అభినందించారు.
పురందేశ్వరి సన్మాన కార్యక్రమంలో ఆమె భర్త, ఎమ్మెల్యే డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, వుడ్ బ్రిడ్జి టౌన్ మేయర్ జాన్ మెక్ కార్మెక్ తదితరులు పాల్గొన్నారు.
Pages: -1- 2 News Posted: 20 October, 2009
|