ఆకట్టుకున్న సాహితీ సదస్సు

రెండవ విభాగంలో జంపాల చౌదరి 'తెలుగు కథలో పరిణామం' అనే అంశంపై ప్రసంగించారు. డాక్టర్ సంధ్యావందనం లక్ష్మీదేవి 'భారతీయ సంస్కృతి -వేద సాహిత్యం' అనే అంశంపై, ప్రసాద్ తుర్లపాటి 'ఆంధ్ర శతక సాహిత్యం-మానవ వనరుల నిర్వహణ' అనే అంశంపై ప్రసంగించారు. తోటకూర ప్రసాద్ ముఖ్యఅతిథి కేతు విశ్వనాథరెడ్డిని సభకు పరిచయం చేశారు. కేతు విశ్వనాథరెడ్డి 'కథ శత జయంతి - ప్రాంతీయ కథా సాహిత్యం' అనే అంశంపై ముఖ్యప్రసంగం చేశారు. ముఖ్యఅతిథిని శాంత పులిగండ్ల పుష్పగుచ్ఛంతో సత్కరించారు. సాహితీ వేదిక కార్యవర్గం శాలువతో, టాంటెక్స్ అధ్యక్షులు శ్రీధర్ కొర్సపాటి జ్ఞాపికతో సత్కరించారు.
మూడవ విభాగంలో స్థానిక రచయితలు, కవులు తమ స్వీయ రచనలను చదివి సభని రంజింపచేశారు. చివరిగా చంద్ర కన్నెగంటి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. ఆహార్ ఇండియన్ రెస్టారెంట్ భోజన సదుపాయం కల్పంచారు. ఈ కార్యక్రమాన్ని అనంత్ మల్లవరపు నిర్వహించి, వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
Pages: -1- 2 News Posted: 23 October, 2009
|