'ఒబిలి'కి ఘన సన్మానం

వలంటీర్ల సమన్వయకర్తగా వ్యవహరించిన శ్రీనివాస్ గనగోని మాట్లాడుతూ, వలంటీర్ల సహాయ సహకారాల కారణంగానే దీపావళి పండుగ వేడుక బ్రహ్మాండంగా జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన సేవలు అందించిన వలంటీర్ల పేర్లను వేదిక మీద చదివి వినిపించారు.
ఈ సన్మానసభలో టిఎఫ్ఎఎస్ కార్యనిర్వాహక వర్గ సభ్యులు ఆనంద్ పాలూరి, రోహిణీకుమార్, మంజు భార్గవ, ఇందిర యలమంచి, సత్య నేమన, గిరిజ కొల్లూరితో పాటు విశేష సంఖ్యలో అతిధులు హాజరయ్యారు.

సూపర్ సింగర్ శ్రీనిధి, రఘు, అనితా కృష్ణ, మధు వీరంతా కొన్ని ఆపాత మధురాలైన పాత పాటలను, మరికొన్ని సరికొత్త సినిమా పాటలను ఆలపించారు. సభకు హాజరైన అతిథులకు గౌరవపూర్వకమైన ఆతిథ్యాన్ని, అందరికీ షడ్రసోపేతమైన విందు భోజనాన్ని కోరియాండర్ యజమానులు హరి, రాము, ఆర్వీ ఏర్పాటు చేశారు.
Pages: -1- 2 News Posted: 29 October, 2009
|