మొగుడ్స్-పెళ్ళామ్స్ మురిపాలు

సాంస్కృతిక కార్యక్రమాల చైర్ పర్సన్ మంజు భార్గవ, యువజన విభాగం సమన్వయకర్త గిరిజ కొల్లూరి చక్కని సమన్వయంతో కార్యక్రమాలను నిర్వహించారు. రిజిస్ట్రేషన్ వ్యవహారాన్ని సభ్యత్వ కమిటీ చైర్ పర్సన్ లక్ష్మి మల్లెల, కోశాధికారి ఇందిర యలమంచి, రోహిణీకుమార్ వేముల చూసుకున్నారు. కార్యక్రమానికి హాజరైన వారికి ట్రోఫీలను ఐటి విభాగం చైర్ పర్సన్ సత్య నేమన రిజిస్ట్రేషన్ సమయంలోనే అందజేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో టిఎఫ్ఎఎస్ సంస్థ కార్యానిర్వాహకవర్గ సభ్యులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా చక్కగా కృషి చేశారు.
ఈ సందర్భంగా శివారెడ్డి చేసిన డ్యాన్సులు, మిమిక్రీ ఆహూతులందరినీ ఎంతగానో అలరించాయి. బుజ్జిగాడు సినిమాలో నటించిన సంజన చేసిన హుషారెత్తించే నృత్యాలు ఆహూతులను ఊర్రూతలూగించాయి. మాటీవీ సూపర్ సింగర్ శ్రీనిధి, గాయకుడు రఘురామ్ చక్కని పాటలతో అలరించారు. వెటరన్ గాయకుడు గరికపాటి ప్రభాకర్ తన కుమార్తె శ్రుతితో కలిసి అమరగాయకుడు ఘంటసాల పాడిన పాటలతో అందరినీ మైమరపించాయి. అనంతరం అతిథులందరికీ షడ్రసోపేతమైన విందు భోజనాన్ని నిర్వాహకులు సరఫరా చేశారు. ఈ కార్యక్రమం ఆ రోజు అర్ధరాత్రి వరకూ ఉత్సాహపూరితంగా కొనసాగింది.

దీపావళి వార్షిక పోటీల్లో ప్రథమ బహుమతి గెలుచుకున్న గ్రూప్ ఇదే వేదిక మీద తమ ప్రదర్శన నిర్వహించింది. దీపావళి పోటీల్లో మొత్తం 375 మంది పాల్గొన్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న చిన్నారులందరికీ టిఎఫ్ఎఎస్ పార్టిసిపేషన్ ట్రోఫీలను అందజేసింది. అలాగే వార్షిక టెన్నిస్ పోటీల్లో విజేతలకు ఇదే వేదిక మీద ట్రోఫీలను ప్రదానం చేశారు.
టిఎఫ్ఎఎస్ సంస్థకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న హైదరాబాద్ కు చెందిన ఒబిలి సంస్థ చైర్మన్ ఒబిలి రామచంద్రారెడ్డిని సంస్థ న్యూజెర్సీలోని కోరియాండర్ హొటల్ లో ఘనంగా సన్మానించింది. హాస్యనటుడు శివారెడ్డిని, శ్రీనిధిని, జి.వి. ప్రభాకర్ ను, శ్రుతిని, గాయకుడు రఘురామ్ ను, నటి సంజనను సంస్థ అధ్యక్షుడు దాము గేదల, కార్యనిర్వాహకవర్గం కలిసి సన్మానపత్రం ప్రదానం చేసి సన్మానించారు. స్థానిక వలంటీర్ల సహాయ సహకారాలతో గనగోని అతిథులకు సీటింగ్ ఏర్పాట్లు చక్కగా చేశారు.
ఎడిసన్ లోని భారతీయ రెస్టారెంట్ కోరియాండర్ యాజమాన్యం ఇంటి రుచులతో కూడిన చక్కని 'దీపావళి విందు భోజనం' ఏర్పాటు చేశారు. భోజనంలో గుత్తి వంకాయ, ఆంధ్రా లడ్డు, పప్పు చారు, దీపావళి ప్రత్యేక స్వీట్ తో పాటు పలు ఆంధ్ర వంటకాలను వడ్డించారు. టిఎఫ్ఎఎస్ ప్రెసిడెంట్ దాము గేదల ఆహూతులందరికీ, కార్యక్రమ నిర్వహణలో ప్రోత్సాహం, సహకారం అందించిన వలంటీర్లు, సంస్థ ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమానికి కార్పొరేట్ స్పాన్సర్లుగా వ్యవహరించిన వారికి, లక్ష్మి, ఒబిలి రామచంద్రారెడ్డి, మల్లారెడ్డి, వినోద్ కొండూరు, మహేందర్ ముసుకు, అమర్ రెడ్డి, ఇతర మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Pages: -1- 2 News Posted: 31 October, 2009
|