'సిద్ధేంద్ర' జన్మదినోత్సవం
చివరిగా అంజలి స్కూల్ ఆఫ్ డాన్స్ అండ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ నుండి ఒక బృంద నృత్యం అంజలి చిక్కుల, చంద్రలేఖ కొవ్వలి, కీర్తన చక్క, రమ్య భావరాజు, రమ్య క్రొత్తపల్లి, శ్రేయ రాజు 'ఆనంద తాండవమాడే' ప్రదర్శించారు. తరువాతి నృత్యాలు ఛి. అనూష మోటూరు 'మండూక శబ్దం', ఛి. నేహారెడ్డి 'ఓంకారరూపిణి' ప్రదర్శించిన వైనం వీరి గురువైన శ్రీమతి రత్నపాప వైద్యుష్యాన్ని తెలియజెప్పేవిగా ఉన్నాయి.
కార్యక్రమంలో రెండవ భాగం శర్మ కూచిపూడి నృత్య రూపకం మహిషాసురమర్దిని. పసుమర్తి వెంకటేశ్వర శర్మ ప్రస్తుతం అమెరికా పర్యటనలో భాగంగా హూస్టన్ లో ఉండడం తమ భాగ్యం అని ఆ రోజు ప్రదర్శన చూసిన వారందరూ భావించారు. వీరు ప్రధానమైన అయిన మహిషాసురుడి పాత్ర ధరించారు. ఈ నృత్య బృందంలో హ్యూస్టన్ నగర వాసి, చిన్నారి శ్రేయరాజు విష్ణుమూర్తి పాత్ర ధరించింది. ఆది నుండి అంతం వరకు రసభరితంగా సాగిన ఈ నృత్య రూపకం ప్రేక్షకుల కళాత్మక దాహాన్ని తీర్చిందనడంలో సందేహం లేదు.
TCA అధ్యక్షుడు శ్రీరామ పాకాల, శ్రీమతి రత్నకుమార్ శర్మను సత్కరించడంతో కార్యక్రమం ముగిసింది.
అక్టోబర్ నెలలోని రెండవ కార్యక్రమ అక్టోబర్ 31 న 'వీణా వాద్య విద్య విశారద' బిరుదాంకితులు అయ్యగారి శ్యామసుందరం వీణ కచేరి జరిగింది. ఈ కార్యక్రమాన్ని షుగర్ ల్యాండ్ లోని శ్రీ అష్టలక్ష్మి గుడి ప్రాంగణంలో నిర్వహించారు. అయ్యగారి వీణ ప్రావీణ్యత ప్రేక్షకులను ముగ్ధులను చేసింది. అన్నమాచార్య కీర్తన బౌళి రాగంలో 'శ్రీమాన్ నారాయణ'తో ఆరంభమై, 'వరలక్ష్మీ నమస్తుభ్యం', 'ప్రహ్లాద భక్తి విజయం', 'తఃయవర్తనం', 'కల్యాణి జావళి', 'జో అచ్యుతానంద'తో ముగించారు.
ఈ వాగ్గేయకారోత్సవం 2009లో జరిగిన అన్ని టిసిఏ కార్యక్రమాలలోకి తలమానికంగా ఉందంటూ నిర్వాహకులను ఆహూతులు అభినందనలతో ముంచెత్తారు.
Pages: -1- 2 News Posted: 4 November, 2009
|