ఘనంగా కనెక్టికట్ దీపావళి

రువాత 'మహిషాసుర మర్ధిని', 'రామ శబ్దం', 'శివ స్తుతి' లాంటి శాస్త్రీయ నృత్యాలు, 'మొక్కజొన్నతోటలో' లాంటి జానపద గీతాలు, అనేక తెలుగు సినిమాల మిడ్లేలు, సోలో పాటలతో ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. సుమ, మురళి, భవాని, వినోద్ నృత్యం ఈ కార్యక్రమంలో మరో హైలైట్. కనెక్టికట్ దీపావళి సంబరాల్లో మొత్తం పాతికకు పైగా ప్రదర్శించిన కార్యక్రమాలు ఆహూతులందరినీ ఎంతగానో అలరించాయి.

అల్పాహార విరామం తరువాత మొదలైన అనేక టీవి పాటల పోటీల విజేత 'కుమారి శ్రీనిధి, 'గమ్యం', 'బ్లేడ్ బాబ్జీ' తదితల సినిమాల నేపథ్య గాయకుడు 'రఘురాం' ప్రేక్షకులను తమ గాన మాధుర్యంతో, వాక్చాతుర్యంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. వేదిక మీదకు ఎక్కి, పెద్ద, చిన్న అందరూ, గాయకుల పాటలకు పాదం కలిపి నృత్యం చేశారు.
టాక్ట్ ప్రెసిడెంట్ రావు యలమంచిలి జ్ఞాపికల బహూకరణతో కార్యక్రమం ముగిసింది. టాక్ట్ కార్యదర్శి శ్రీకాంత్ నెలకుడితి, కోశాధికారి కృష్ణ అలవాల, ఈ.సి. గోపాల్ కొమ్మూరు, టీఫాస్ న్యూజెర్సీ ఈ.సి సత్య నేమానతో కలసి భోజనానతరం శ్రీనిధి, రఘురాంలకు వీడ్కోలు పలికారు.
Pages: -1- 2 News Posted: 5 November, 2009
|