నాట్స్ సంబరాలు ప్రారంభం
కార్యక్రమానికి హాజరైన అందరినీ ప్రసిద్ధ వెంట్రిలాక్విస్ట్ ప్రసాద్ శానాపతి తన వెంట్రిలాక్విజంతో కడుపుబ్బ నవ్వించారు. యువ తెలుగు నేపథ్య గాయకుడు సింహ పాడిన హుషారెత్తించే పాటలతో అతిథులను ఉర్రూతలూగించాడు. తెలుగు సినిమా హీరోయిన్ అంకిత 'సింహాద్రి' సినిమాలోని 'నువ్వు విజిలేస్తే' పాటకు చేసిన డ్యాన్స్ కు ఆహూతులు ఈలలు, చప్పట్లతో తమ ఆనందాన్ని చాటుకున్నారు. 'ఆ చందమామ నేనే' పాటకు చిన్నారి నితీష ఏలూరి చేసిన డ్యాన్స్ కు అతిథుల నుంచి విశేష స్పందన లభించింది. స్థానిక గాయనీ గాయకులు రాజీవ్, అనితా కృష్ణ పాడిన మృదు మధురమైన పాటలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. నవీకరించిన నాట్స్ వెబ్ సైట్ ను మల్లారెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచిన 'గజల్ మాస్ట్రో' డాక్టర్ గజల్ శ్రీనివాస్ తన గజల్స్ తో అందరినీ అబ్బురపరిచారు.

స్థానిక ప్రవాసాంధ్ర నాయకులు వల్లభనేని యుగంధర్ రావు, మల్లారెట్టి, పూర్ణచంద్రారెడ్డి, డాక్టర్ మధు కొర్రపాటి, విజయ్ రెడ్డి అన్నపురెడ్డి, హరనాథ్ దొడ్డపనేని, శైలజ అడ్లూరి, విక్రం జంగం, బాపినీడు, బిక్కిన మహేష్, జనని కృష్ణ, ప్రసాదరావు నెప్పల్లి, దగ్గుబాటి శ్రీనివాస్ ప్రసాద్, డాక్టర్ అట్లూరి పూర్ణ, డాక్టర్ బాబూరావు దొడ్డపనేని, వెంకటేశ్ ముత్యాల, శివ ముతికి, డాక్టర్ ప్రేం నందివాడ, దాము గేదల, నటరాజ్ గంధం, మహేష్ సలాది, మూర్తి గులివెందుల, ధర్మారెడ్డి బొడ్డు, నాగేంద్ర గుప్తా, దేశు గంగాధర్, ప్రసాద్ కనగల, మద్దాలి శ్రీనివాస్, పమిడిముక్కల మురళీకృష్ణ, రామ్ సూర్యదేవర, అంజూ కొండబోలు, మోహన్ రెడ్డి పట్లోళ్ళ, మహేందర్ రెడ్డి ముసుగు, రమేష్ ఏలూరు, రాజ్ అల్లాడ, జగదీశ్వర్ రెడ్డి, కరణి, సత్య నేమని, జగన్ ఎర్రంరాజు, జక్కంపూడి సుబ్బారాయుడు, నాగేందర్ మాధవరం, మురళి చింతలపల్లి, శ్రీనివాస్ తూనుగుంట్ల, ఇందుకూరి గణేశ్ రాజు, ఈమని వెంకటరావు, కొడాలి శ్రీనివాస్, జోగేశ్వరరావు పెద్దిబోయిన, శ్రీనివాస్ కోనేరు, చక్రధర్ వొలేటి, శేఖరం కొత్త, కోట ప్రసన్న, అడుసుమిల్లి రతీష్, విష్ణు వీరపనేని, శేషుబాబు వీరమాచనేని, గన్నె రమణ, రవి పొట్లూరి, అభిరుచి శ్రీనాథ్, కొత్తపాటి సాంబయ్య తదితరులు హాజరయ్యారు.
కెరీస్ అసిస్టెన్స్ అవగాహన, డిజిటల్ లైబ్రరీల గురించి శేషుబాబు కానూరి వివరించారు. పచ్చదనం ఆవశ్యకతపై 'సేవ్ ది వ్యూయర్స్ ఆర్గన్' సంస్థ వ్యవస్థాపకురాలు పూజ ఎప్పనపల్లి తెలియజేశారు.

అతి కొద్ది సమయంలోనే నాట్స్ సంబరాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు స్థానిక వలంటీర్లు మోహనకృష్ణ మన్నవ, అనిల్ బొప్పుడి, రమేష్ గంధమనేని, రమేష్ నూతలపాటి, సుధీర్ తుమ్మల, ప్రసాద్ వడ్డెల, వాసు తుపాకుల, రవి పర్వతనేని, భాస్కర్ భూపతి, రమేష్ చంద్ర, రవి ధన్నపునేని, ప్రదీప్ సువర్ణ, శ్రీనివాస్ గనగోని, మధు రెడ్డి, రాజ్ అల్లాడ, కృష్ణ తెల్లా, విష్ణు ఆలూరు, ప్రసాద్ గుర్రం, రమణ కోనేరు, ప్రశాంత్ వేముగంటి, రంజిత్ చాగంటి, ప్రజ్వల శ్రమించి, చక్కని సమన్వయంతో కృషి చేశారని నాట్స్ సంస్థ నిర్వాహకులు అభినందనలు తెలిపారు. 'పుణ్యభూమి నా దేశం' దేశభక్తి గేయంతో నాట్స్ సంబరాల ప్రారంభ కార్యక్రమం ముగిసింది. డాక్టర్ మధు కొర్రపాటి, మోహన కృష్ణ మన్నవ వందన సమర్పణ చేశారు.
Pages: -1- 2 News Posted: 6 November, 2009
|