తానా సాంస్కృతిక పోటీలు
ఆంధ్రప్రదేశ్ లోని మహబూబ్ నగర్, కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇటీవల వరదలు సంభవించి నిరాశ్రయంగా మారిన బాధితులకు దుప్పట్లు, ఆహారం, మందులు అందజేసినట్లు జయరామ్ కోమటి తెలిపారు. వరద బాధితుల కోసం ప్రవాసాంధ్రుల నుంచి తమ సంస్థకు లక్ష డాలర్లు విరాళంగా అందజేశారని ఆయన ప్రకటించారు. దాతలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. గతంలో కూడా ప్రకాశం జిల్లాలోని చీరాల, కృష్ణా జిల్లాలోని పాపవినాశనంలలో 'తానా నగర్'లు నిర్మించినట్లు తానా అధ్యక్షుడు జయరామ్ కోమటి గుర్తు చేశారు. అదే విధంగా ఇప్పుడు అందిన విరాళాలతో బాధితులకు శాశ్వతంగా ఉపయోగపడే కార్యక్రమాలతో ముందుకు వస్తామన్నారు.
'ఆకలితో ఉన్నవారికి ఆహారం', 'చిన్నారులకు ఆటబొమ్మలు' లాంటి సేవా కార్యక్రమాలను నవంబర్, డిసెంబర్ నెలల్లో నిర్వహించేందుకు తానా ప్రాంతీయ డైరెక్టర్లు కార్యాచరణ రూపొందించారని జయరామ్ కోమటి తెలిపారు.
తెలుగు ప్రజల్లో ఐక్యతను సాధించడం, 2011లో ఒకే ఒక మెగా కాన్ఫరెన్స్ నిర్వహించడం, ప్రస్తుతం ఉన్న సంస్థ బై లాస్ ను సవరించి ఇతరులకు కూడా సభ్యులను చేర్చుకునే విషయాన్ని తాము పరిశీలిస్తున్నామన్నారు. ఈ క్రమంలో గతంలో తానా నుంచి బహిష్కృతులైన ప్రతి ఒక్కరినీ మళ్ళీ సంస్థలో చేర్చుకునే క్రమంలో వారితో చర్చలు నిర్వహిస్తున్నామన్నారు.
Pages: -1- 2 News Posted: 16 November, 2009
|