వైభవంగా సాయి విగ్రహ ప్రతిష్ఠ

సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాల వారం రోజులు పాతిక మందికి పైగా మహిళా వలంటీర్లు ప్రతి పూజకూ పూలతో వివిధ రకాల అలంకరణలు ఎంతో శ్రమకోర్చి చేశారు. మొత్తం పూలతో చేసిన బాబా సమాధి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కెనడా నుంచి నాదస్వర విద్వాంసుడిని ఈ కార్యక్రమం కోసం ఆలయం నిర్వాహకులు ప్రత్యేకంగా రప్పించారు. పిల్లలతో సహా భక్తులంతా సాంప్రదాయ దుస్తులు ధరించి కార్యక్రమానికి హాజరు కావడంతో భారతదేశంలోనే ఈ మహోత్సవం జరుగుతున్నదా అన్న భావన కలిగింది. విగ్రహం ప్రతిష్ఠాపన సమయంలో భక్తులు హెలికాప్టర్ నుంచి ఆలయం పైన పూల వర్షం కురిపించారు.
ఈ ఉత్సవాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా లివోనియా నగర మేయర్, భారతదేశం నుంచి శ్రీ షిరిడీ సాయిబాబా సంస్థానం కార్యనిర్వహణాధికారి హాజరయ్యారు. చిన్నారులు ప్రదర్శించిన భారతీయ సాంప్రదాయ నృత్యాలు, కార్యక్రమాలు ఆహూతులను ఎంతగానో అలంకరించాయి. ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులు, షిరిడీ ఆలయం ప్రతినిధులు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రముఖులకు శ్రీ సాయి సంస్థానం ఆలయం ధర్మకర్తల మండలి చైర్మన్ రావి కుటుంబరావు, కార్యనిర్వాహక మండలి ప్రెసిడెంట్ గోగినేని శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వలంటీర్లు, కమిటీల సభ్యులకు సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠ కో ఆర్డినేటర్ మెహర్ వెలగపూడు కృతజ్ఞతలు తెలిపారు.

శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయం కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ (ఎలెక్ట్) చల్ల దంతేశ్వరరావు, ఆలయం మేనేజర్ గుత్తా వెంకటేశ్వరరావు, కార్యదర్శి వంశి కారుమంచి, సంయుక్త కార్యదర్శి సూర్య మాచేటి, కోశాధికారి వెంకట్ రామినేని, సంయుక్త కోశాధికారి సురేష్ కొప్పుసెట్టి, వలంటీర్ కో ఆర్డినేటర్ రాజ్ కామేటి, ఈవెంట్ కో ఆర్డినేటర్ చందరమౌళి శర్మ, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు అరుణ భావినేని, రాణి తుల్లురి, మురళీకృష్ణ కోడలి, కృష్ణమోహన్ నిచ్చనమెట్ల, బసవేంద్ర సూరపనేని, సుధాకర్ కాట్రగడ్డ, సురేష్ దారెడ్డి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాన్ని విజయవంతం చేసేందుకు అహరహం శ్రమించారు.
సుమారుగా పది వేల మంది భక్తులకు ప్రసాదాన్ని ఉచితంగా సమకూర్చిన స్థానిక మిర్చి ఇండియన్ కుషన్, నమస్తే ప్లేవొర్స్, ప్రియి ఇండియన్ కుషన్, మద్రాస్ మసాల, బాలాజీ ఫుడ్స్, సువై, మయూరి ఇండియన్ రెస్టారెంట్ల యాజమాన్యాలకు సాయి సంస్థానం కమిటీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది.
Pages: -1- 2 News Posted: 20 November, 2009
|