అలరించిన 'మీరా'

చిన్నతనంలో మీరాగా సుమన్ వడ్లమాని రమ్యంగా నృత్యం చేశారు. యువ మీరాగా ప్రాహుతి సూరి తన చక్కని హావభావాలతో ఆహూతులందరిని మైమరపించారు. భగవాన్ కృష్ణుడిగా ప్రణమ్య సూరి తన చక్కని ప్రదర్శనతో అందరి హృదయాలను దోచుకున్నారు. వృద్ధ వయస్సులోని మీరాగా శ్రీలత సూరి అభినయాన్ని పండించారు. మీరా భక్తి భావాన్ని అభినయంలో ఆమె అందరి ప్రశంసలనూ మూటగట్టుకున్నారు. ఈ నృత్య బాలెలో రాణాగా భాకరి బుర్రా, అక్బర్ గా డాక్టర్ రాజేష్ అడుసుమిల్లి, తాన్ సేన్ గా శ్రీకర్ నవులూరి చక్కగా రాణించారు. మీరా తల్లిగా, అత్తగారిగా మధురి చిత్తజల్లు, నాగరాణి కామరపు చక్కగా తమ తమ పాత్రల్లో అలవోకగా రాణించారు. లక్ష్మి గుప్త, పల్లవి షా, ప్రణుతి సూరి, మిథిల వడ్డి, మోనిష వీరపనేని, రమ్య పసులూరి, స్పృహ షా, నాగరాణి కామరపు గోపికలుగాను, ప్రణమ్య సూరి కృష్ణ పాత్రల్లో చక్కని సమన్వయంతో రాసక్రీడ అంశాన్ని ప్రశంసనీయంగా ప్రదర్శించారు. వీరితో పాటుగా అందమైన నెమళ్ళుగా నికితా రెడ్డి, శోభిత పోచిరాజు, శిల్పిత పోచిరాజు, అజిత నాయర్ అభినయించి మన్ననలు అందుకున్నారు.
వివాహ ఊరేగింపు అంశాన్ని కావ్య కైనూర్, అఖిల నన్నెబోయిన, సుష్మ పాయ్, సుధీక్ష పాయ్, అక్షయ ములకల, అనంగ గౌరు, శ్రుతి వేదాల, తేజస్వి చిల్లకూరు, శ్రీనందిని కొరిపల్లి, యశశ్రీ వడ్డి, శ్రీయ కన్నెబోయిన, సింధు నేమన, మేఘ మన్నె, కీర్తన కాంబోజి, కైవల్య గూడూరు, అనన్య పోణంగి, మేధా రెడ్డి, మేధ వల్లూరుపల్లి, మైత్రేయి అబ్బూరు, గ్రీష్మ గీడిపల్లి కన్నుల విందుగా ప్రదర్శించారు. ఈ నృత్య బాలె అంశాన్ని ఎంపిక చేసి ప్రదర్శించిన శ్రీలత సూరికి ఆహూతులు, అతిథుల నుంచి అశేషంగా ప్రశంసలు వచ్చాయి. రంగస్థలాన్ని చక్కగా తీర్చిదిద్దినందుకు, రంగు రంగుల దుస్తులు, స్పెషల్ ఎఫెక్ట్స్ తీసుకువచ్చినందుకు బహుముఖీన అభినందనలు అందుకున్నారు.
మీరా నృత్య బాలె విజయవంతం కావడానికి వలంటీర్లు, ప్రవాసాంధ్రులు సమైక్యంగా అహరహం శ్రమించారు. వసంత్ సూరి, రాజేశ్వరి చల్లా వ్యాఖ్యాతలుగా చక్కని సమన్వయంతో కార్యక్రమాన్ని నడిపించి ప్రశంసలు అందుకున్నారు.
Pages: -1- 2 News Posted: 24 November, 2009
|