ఎన్నారై వాసవైట్ల ఉదారత

ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ, ఎన్నారై విఎ నిర్వహిస్తున్న ప్రధానమైన, ప్రముఖమైన కార్యక్రమాల గురించి సూక్ష్మంగా వివరించారు. ఎన్నారై విఎ సంస్థ ఉదాత్తంగా ముందుకు వచ్చి బాధితులకు ఆర్థిక సహాయం చేస్తున్నదని, దీన్ని తమ హక్కుగా భావించరాదని లబ్ధి పొందిన బాధిత కుటుంబాలకు వెంకటేశ్ విజ్ఞప్తి చేశారు. వరద బాధితుల సహాయం కోసం రాష్ట్రప్రభుత్వం చేస్తున్న వివిధ కార్యక్రమాల గురించి కూడా టిజి ఈ సందర్భంగా ప్రస్తావించారు. తమ జన్మభూమి కోసం ఎన్నారై విఎ బహువిధాలుగా చేస్తున్న సేవల గురించి విన్న టిజి ఎంతగానో సంతోషించారు. తమ సేవలను మరింత విస్తృతం చేసేందుకు వీలుగా హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ లో ఉన్న తన కార్యాలయ భవన సముదాయంలో ఎన్నారై విఎ సంస్థ ఆఫీసు కోసం జాగా ఇచ్చేందుకు టిజి సంసిద్ధత వ్యక్తం చేశారు.

ఆర్థిక సహాయం అందుకున్న కుటుంబాలు ఎన్నారై విఎ సంస్థకు, ఈ సంస్థ ద్వారా తమకు విరాళాలు అందజేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి నిత్యమూ అనేక కార్యక్రమాలతో బిజీబిజీగా ఉండే టిజి వెంకటేశ్ మధ్యాహ్న భోజనం అనంతరం తమతో అత్యధిక సమయం గడపడం పట్ల ఎన్నారై విఎ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. వరద బాధితులను ఆర్థికంగా ఆదుకునేందుకు ఉదారంగా ముందుకు వచ్చి విరాళాలు అందజేసిన ప్రతి ఒక్కరికీ ఎన్నారై విఎ సంస్థ నిర్వాహకులు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, టిజివి గ్రూప్ సంస్థల చైర్మన్ టిజి వెంకటేశ్, న్యూజెర్సీలోని ఐటి సంస్థ చైర్మన్ సురేష్, న్యూజెర్సీ నుంచి టిపి మీడియా ఇండియా లిమిటెడ్ సంస్థ చైర్మన్ ప్రసాద్ కూనిశెట్టి, లాస్ ఏంజిల్స్ నుంచి కిశోర్ గడేవార్, బెంగళూరు నుంచి ఎన్నారై విఎ ఇంటర్నేషనల్ డైరెక్టర్ గౌర కృష్ణమూర్తి (కిట్టన్న), హైదరాబాద్ నుంచి కంపెనీ సెక్రటరీ రవికాంత్, కోటేశ్వరరావు, సుదర్శన్ గార్లపాటి, కామారెడ్డి నుంచి శ్రీధర్ ఐతా, హైదరాబాద్ నుంచి చార్టర్డ్ అకౌంటెంట్ మధుమోహన్, కల్లూరు వాసవీ ఆలయం అధ్యక్షుడు రాజశేఖర్, సుధాకర్, శ్రీధర్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
Pages: -1- 2 News Posted: 27 November, 2009
|