ఇక ద్వంద్వ పౌరసత్వం రెండు దేశాల మధ్య ఉన్నఅనేక సారూప్యాలను ప్రధాని వివరించారు. 'రాబోయే సంవత్సరాల్లో భారతీయులు, అమెరికన్ల మధ్య నిజమైన మేథో భాగస్వామ్యాన్ని, వ్యాపార భాగస్వామ్యాలను చూడదల్చుకున్నాను. రెండు దేశాల ప్రజలు స్వేచ్చాయుతమైన. దాపరికం లేని సమాజంలో మనుగడ సాగిస్తున్నారు. రెండు దేశాల్లోనూ విభిన్న భాషలు, భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, వివిధ జాతులు, అనేక మతాలు కలిగిన సమాజం ఉంది. మన సమాజాలను హరివిల్లుతో పోల్చవచ్చు'అని మన్మోహన్ అన్నారు.
ఉభయ దేశాలలోనూ మనం తరచుగా అనేక అంశాలపై పనిచేస్తున్నామని, పరస్పర సహకారం, పౌర సమాజ సంస్థలు, స్వచ్చంద సేవా కార్యక్రమాలు, వస్తువుల వినియోగం, ఆలోచనల మార్పిడి వంటి అంశాలపై కలిసి పనిచేస్తున్నామని వివరించారు. ఇది భారతీయులు అమెరికాతో సులభంగా మమేకం కాగలుతున్నారని ఆయన చెప్పారు. అలానే అమెరికన్లు కూడా భారతీయ ఆత్మను పొందగలరని చెప్పే సాహసం తాను చేస్తున్నానని ప్రధాని అన్నారు. రెండు దేశాల మధ్య, సమాజాల నడుమ సంబంధ బాంధవ్యాలను కొనసాగించే పటిష్టమైన వారధులుగా భారతీయ అమెరికన్లు ఉంటారనే విశ్వాసం తనకు ఉందని మన్మోహన్ అన్నారు.
అమెరికాతో చైనా, పాకిస్తాన్ సాగిస్తున్న అనుబంధాల మధ్య దాగిఉన్న మర్మాలను కూడా ప్రధాని ప్రస్తావించారు. 'అమెరికా-భారత్ ల మధ్య ఉన్న సంబంధాలు సంక్షోభాలనుంచో, లేదా మరెవరి ప్రమేయంతోనో ఏర్పడింది కాదు. మరే ఇతర సంబంధాల వలనో మనుగడ సాగిస్తున్నదీ కాదు. ఇది మనం ఇచ్చిపుచ్చుకున్న విలువల నుంచి, పరస్పర గౌరవం నుంచి, రెండు ప్రజాస్వామ్యదేశాల్లో బతుకుతున్న ప్రజల మధ్య ఏర్పడింద' ని మన్మోహం వివరించారు.
Pages: -1- 2 News Posted: 27 November, 2009
|