చికాగోలో తెలంగాణ ప్రతిధ్వని

తెలంగాణ ఉద్యమం ముఖ్యమైన ఘట్టంలో ప్రవేశించిన ప్రస్తుత చారిత్రక సమయంలో పాల్గొంటున్న అన్ని తెలంగాణ సంస్థలతో పాటు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా పాలుపంచుకోవాలని తెలంగాణ ఎన్నారైలు అభ్యర్థించారు. ఎన్నికల సమయంలో తెలంగాణ ఏర్పాటుకు హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానంపై ఇప్పుడైనా తన హామీని నెరవేర్చేలా తెలంగాణ నాయకులు ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఇలాంటి చారిత్రిక సయమంలో అయినా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తమ మౌనాన్ని వీడకపోతే చరిత్ర క్షమించబోదని హెచ్చరించారు. తెలంగాణ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపిలు, పార్టీ కార్యకర్తలు, ఎన్నికైన ప్రజా ప్రతినిధులు మూకుమ్మడిగా తమ తమ పదవులకు రాజీనామా చేయాలని తెలంగాణ ఎన్నారైలు విజ్ఞప్తి చేశారు. అలా రాజీనామా చేసిన నాయకుల త్యాగాన్ని తెలంగాణ ప్రజలు మరిచిపోరని, వారి రాజకీయ భవిష్యత్తు ఏమైపోతుందో అన్న భయం వద్దని, వచ్చే ఎన్నికల్లో వారినే తెలంగాణ ప్రజలు కచ్చితంగా ఎన్నుకుంటారని తెలంగాణ ఎన్నారైలు పేర్కొన్నారు.
మధ్యాహ్నం ప్రారంభమైన తెలంగాణ ఎన్నారైల సమావేశం సాయంత్రం వరకూ కొనసాగింది. తెలంగాణ సమస్యపై పలు కోణాల్లో సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరూ అనుక్షణం నినాదాలు, పాటలు, చర్చలతో బిజీబిజీగా గడిపారు. అతితక్కువ సమయంలో సమాచారం ఇచ్చినప్పటికీ డెట్రాయిట్, స్ప్రింగ్ ఫీల్డ్ లాంటి దూరప్రాంతాల నుంచి కూడా సమయం కేటాయించి సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. సంధ్య పాడిన 'రేలా రేలా రే, రేలా రేలా రే' మరో పాటతో సమావేశం ముగిసింది. ఈ పాటకు ప్రతి ఒక్కరూ సంధ్యతో శ్రుతి కలిపారు. సంధ్య పాడిన పాటలు తమకు ఎంతో బలాన్ని, స్ఫూర్తినిచ్చాయని సమావేశానికి హాజరైన అందరూ ప్రశంసించారు.
Pages: -1- 2 News Posted: 7 December, 2009
|