పరువు తీసిన పిచ్చి పిచ్
ఆ పక్కనే ఉన్న పిచ్ పై మ్యాచ్ ను పునఃప్రారంభించాలని డిడిసిఎ, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) సీనియర్ అధికారులు మొదట ఆలోచించారు. కాని ఈ పిచ్ కూడా తగిన విధంగా సిద్ధం కాలేదని తెలిసి ఆ ప్రతిపాదన విరమించుకున్నారు.
పిచ్ ను సిద్ధం చేసే బాధ్యత ఆతిథేయ సంఘానిదే. అంటే ఈ కేసులో డిడిసిఎదే ఈ బాధ్యత. అయితే, బిసిసిఐ మైదానాలు, పిచ్ ల కమిటీ ఈ బాధ్యతను పర్యవేక్షించింది. ఈ పరిణామంతో బిసిసిఐ వెంటనే పూనుకుని దల్జీత్ సింగ్ సారథ్యంలోని తన మైదానాలు, పిచ్ ల కమిటీని రద్దు చేసింది. కాగా, ప్రపంచ కప్ మ్యాచ్ లకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం కోల్పోవచ్చనే సూచనపై వ్యాఖ్యానించడానికి డిడిసిఎ నిరాకరించింది. 'ఊహాజనిత అంశంపై నేను వ్యాఖ్యానించదలచుకోలేదు' అని డిడిసిఎ అధ్యక్షుడు అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. 'ఇందుకు కారణాలను మదింపు వేయడం, పరిష్కార చర్యలు తీసుకోవడం మా ప్రథమ ప్రాధాన్యం' అని జైట్లీ చెప్పారు. అయితే, పిచ్ రూపకల్పనతో నేరుగా సంబంధం ఉన్న డిడిసిఎ అధికారులు కొందరు రాజీనామా చేశారు.
ప్రమాదకర పిచ్ కారణంగా ఒక మ్యాచ్ ను అర్ధంతరంగా రద్దు చేయడం భారత క్రికెట్ చరిత్రలో ఇది రెండవసారి. మొదటిసారి 1997 డిసెంబర్ 25న ఇండోర్ లో ఇదేవిధంగా పోటీని రద్దు చేశారు. అప్పటి ప్రత్యర్థి జట్టు కూడా శ్రీలంకే. ఇండోర్ లోని నెహ్రూ స్టేడియంను రెండు సంవత్సరాల పాటు మ్యాచ్ వేదికల జాబితాలో నుంచి తొలగించారు.
Pages: -1- 2 News Posted: 28 December, 2009
|