యుఎస్ లో 'మాయాబజార్'
సరిగ్గా 52 సంవత్సరాల తర్వాత 'మాయాబజార్ ' చిత్రం అత్యాధునిక కలర్ టెక్నాలజీతో రంగులు అద్దుకుని మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుపు-నలుపు రంగు నుంచి పూర్తి స్థాయిలో రంగులద్దుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చిన తొలి చిత్రం క్రెడిట్ సైతం ఈ చిత్రానికే దక్కింది. గోల్డ్ స్టోన్ టెక్నాలజీకి చెందిన 165 మంది తెలుగు సాంకేతిక నిపుణులు అహరహం శ్రమించి ఈ చిత్రాన్ని రంగుల్లోకి మార్చారు. ఇందుకోసం 16.6 మిలియన్ కలర్ షేడ్స్ ఉపయోగించారు. స్కోప్ తో పాటు గతంలో ఉన్న మోనో ట్రాక్ నుంచి డిటిఎస్ కు మార్చడం ద్వారా సాంకేతిక ప్రతిభను చూపారు. ఈ చిత్రాన్ని ఓవర్ సీస్ లో విడుదల చేసేందుకు తమకు సహకరించిన
చెర్రీ, సాయిలకు రిలయెన్స్ మీడియా వర్క్స్ తమ కృతజ్ఞతలు తెలియజేసింది. ఈనెల 5న యుఎస్ అంతటా రిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని తమతమ సిటీల్లో ప్రదర్శించాలనుకునే వారు తమను సంప్రదించాల్సిందిగా కోరింది.
Raman Sanchula
Director of Marketing
Reliance Media Works
Raman.sanchula@relianceada.com
(408) 464-4788
Cherry @ 9862568846 (India)
Pages: -1- 2 News Posted: 3 February, 2010
|