'తెలంగాణలో సమైక్యాంధ్ర'
ఆంధ్రప్రదేశ్ లో తాజాగా వివిధ ప్రాంతాల మధ్య నెలకొన్న విద్వేష భావాలకు, ఆందోళకర పరిస్థితులకు కొందరు స్వార్థ రాజకీయ పార్టీలు, నాయకులే కారణమని రాజగోపాల్ ఆరోపించారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగాలు లభిస్తాయంటూ వస్తున్న వాదనను ఆయన నిర్ద్వంద్వంగా ఖండించారు. రాష్ట్రం విడిపోవాల్సిన పరిస్థితే వస్తే ముఖ్యమంత్రి, మంత్రులు, అత్యున్నత స్థాయి ఉద్యోగాలు లాంటివి కొన్ని వందల మందికి మాత్రమే లభించే వీలుంటుందన్నారు. నిజానికి అన్ని లక్షల ఉద్యోగాలు అవసరం లేదని, వాటికి బడ్జెట్ కూడా లభించే అవకాశం లేదన్నారు. సమైక్యాంధ్రపై అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ విధానం ఏమిటంటూ ప్రసాద్ అడిగిన ప్రశ్నకు లగడపాటి బదులిస్తూ, సమైక్యాంధ్ర గురించి రాహుల్ కు బాగా తెలుసని, సమైక్యాంధ్రకే ఆయన ఓటు వేస్తారని అన్నారు.
ఎ.పి. ఎన్నారై ఫోరం కోర్ కమిటీ సభ్యుడు చక్రవర్తి వందన సమర్పణతో కాన్ఫరెన్స్ కాల్ ముగిసింది. సమైక్యాంధ్ర ఉద్యమంలో లగడపాటి పోషిస్తున్న పాత్రపై ఎన్నారై ఫోసం సభ్యులందరూ ముక్తకంఠంతో ప్రశంసించారు. ఈ కాన్ఫరెన్స్ కాల్ లో చక్రవర్తి నలమోతు (న్యూయార్క్ - నల్గొండ), దేవానంద్ కొండూర్ (అట్లాంటా - విజయవాడ), గిరి మల్లవరం (అట్లాంటా - తిరుపతి), గురవారెడ్డి (అట్లాంటా - గుంటూరు), గురు పరదరమి (అట్లాంటా - చిత్తూరు), జవహర్ రెడ్డి (బర్మింగ్ హామ్ ఎ.ఎల్. - గుంటూరు), మదన్ మోహన్ రెడ్డి (న్యూయార్క్ - మహబూబ్ నగర్), మురళి పాశం (అట్లాంటా - కర్నూలు), పద్మజ (వర్జీనియా - పశ్చిమ గోదావరి), పున్నం మంతెన (న్యూజెర్సీ - హైదరాబాద్), రాజ్ కాశిరెడ్డి (అట్లాంటా - కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన రాజ్ గత 40 -50 సంవత్సరాలుగా హైదరాబాద్ లో స్థిరపడ్డారు), రవీంద్ర సింగరెడ్డి (అట్లాంటా - నిజామాబాద్), రమణ దేవులపల్లి (న్యూజెర్సీ - చిత్తూరు), రమణ కోగంటి (న్యూయార్క్ - మూడు తరాలుగా నిజామాబాద్ లో స్థిరపడ్డారు), సత్య నేమన (న్యూజెర్సీ - శ్రీకాకుళం), శేషగిరిరావు మేకా (బోస్టన్ - కృష్ణా), శ్రీనివాస్ వేముల (కాలిఫోర్నియా - ఖమ్మం), సుధ కోగంటి (ఫ్లోరిడా - మూడు తరాలుగా నిజామాబాద్ లో స్థిరపడ్డారు), వెంకట్ రెడ్డి (అట్లాంటా - గుంటూరు), వేణు నెల్లూరి (బోస్టన్ - ఖమ్మం), విజయ్ రెడ్డి అన్నపరెడ్డి (డెలావేర్ - హైదరాబాద్), విమల్ కావూరు (న్యూయార్క్ - హైదరాబాద్) పాల్గొన్నారు.
Pages: -1- 2 News Posted: 16 February, 2010
|