తెలంగాణ కల్చరల్ నైట్

అనిల్ ఇరవత్రి మాట్లాడుతూ, గత 50 ఏళ్ళుగా తెలంగాణాకు ఏ విధంగా అన్యాయం జరిగింది, వివిధ రాజీకీయ పార్టీలు తెలంగాణను ఎలా మోసం చేస్తున్నాయి, ప్రస్తుతం రాష్ట్ర్రంలో జరుగుతున్న పరిణామాలను సభకు వివరించారు. డెట్రాయిట్ వాసిగా ఇక్కడున్న ప్రతి ఒక్కరితో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకొన్నారు. తెలంగాణా ప్రజల త్యాగాలను, ఆకాంక్షను తెలియచేస్తూ ఉద్యమంలో అమరులైన వారి నుండి స్ఫూర్తి పొంది ప్రత్యేక తెలంగాణా సాధనలో తమ వంతు సహాయ సహకారాలు అందించాలని అమెరికాలో ఉన్న ప్రతి ఒక్క తెలంగాణా బిడ్డను కోరుతున్నట్లు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ సాధించిన తరువాతే మళ్ళీ డెట్రాయిట్ వస్తానని అనిల్ శపథం చేశారు. అనిల్ ప్రసంగానికి ఆహూతుల నుంచి విశేష స్పందన లబించింది. అనిల్ కి డెట్రాయిట్ తెలంగాణా కమ్యూనిటీ తరఫున శైలేంద్ర సనం, హరి మారాజు మొమెంటో అందచేశారు.
ఈ కార్యక్రమానికి స్థానిక మిర్చి రెస్టారెంట్ విందు భోజనం ఏర్పాట్లు చేశారు. కార్యక్రమ నిర్వహణలో చురుకైన పాత్ర పోషించిన సునీల్ మర్రి, వెంకట్ మంతెన, దామోదర్ గంకిడి, అశోక్, శైలేంద్ర సనం, సంతోష్, నాగేందర్, ప్రవీణ్, ప్రీతి, సుమన్, ప్రవీణ్ కేసిరెడ్డి తదితరులకు డిటిసి తరఫున హరి మారాజు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
Pages: -1- 2 News Posted: 22 February, 2010
|