నాట్స్ వైద్య శిబిరం సక్సెస్
ఈ శిబిరానికి హాజరైన ఆరోగ్యార్థులందరికీ ఉచిత వైద్య పరీక్షల కూపన్లను నిర్వాహకులు అందజేశారు. బాడీ ఫ్యాట్ కొలతలు, బరువు తగ్గింపుపైన నిపుణులు సలహాలు ఇచ్చారు. న్యూట్రిషనల్ కన్సల్టెంట్లు ఆరోగ్యానికి తీసుకోవాల్సిన వివిధ రకాల ఆహార నియమాలు, పదార్థాల గురించి, అత్యవసర ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు సహాయం ఎలా పొందాలి తదితర అంశాలపై చక్కని అవగాహన కల్పించారు. నాట్స్ సంస్థ నూతన సభ్యులకు బ్లడ్ సుగర్ కొలిచే యంత్రాలు, స్ట్రిప్ లు, మెడిటేషన్ కూపన్లను విజయ్ రెడ్డి అన్నపరెడ్డి ఉచితంగా అందజేశారు. సభ్యులకు సుమారు 50 బ్లడ్ సుగర్ కొలిచే యంత్రాలను ఆయన పేషెంట్లకు అందజేశారు.
ఈ ఉచిత వైద్య శిబిరానికి 'నైబర్ కేర్ ఫార్మసీ', 'Indiaissaving.com' తమ సేవలను ఇతోధికంగా అందజేశాయి. 'దక్షిణ్', 'అభిరుచి', 'బాబా హట్' సంస్థలు శిబిరానికి హాజరైన అందరికీ కమ్మని రుచికరమైన ఆహారాన్ని సరఫరా చేశాయి. మధ్య మధ్యలో నిర్వాహకులు లక్కీ డిప్ లు నిర్వహించి విజేతలకు వివిధ రకాల వైద్య పరికరాలు అందజేశారు. ఈ వైద్య శిబిరాన్ని నాట్స్ బాధ్యులు మోహన్ కృష్ణ మన్నవ, అనిల్ బొప్పుడి చక్కని ప్రణాళికతో చాకచక్యంగా నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరం పెద్ద విజయవంతం కావడానికి నాట్స్ బృందం శ్రీనివాస్ గనగోని, రమేష్ గంధమనేని, రమేష్ నూతలపాటి, రాజ్ అల్లాడ, వాసు తుపాకుల, సుధీర్ తుమ్మల, రంజిత్ చాగంటి, రవి పర్వతనేని, రమణ కోనేరు, విష్ణు ఆలూరు, ప్రసాద్ గుర్రం, కృష్ణ తెల్లా, రామానాయుడు కంటుభుక్త, శ్రీధర్ దోనేపూడి, ప్రజ్వల, పున్నం మంతెన, రణధీర్ ఠాకూర్, శివ మువ్వా తదితరులు సహృదయంతో కృషి చేశారు. చిన్నారులు చైతన్య తుమ్మల, సాయికుమార్ గనగోని కూడా ఉచిత వైద్య శిబిరం సక్సెస్ లో తమ వంతు పాత్ర నిర్వహించారు. మీడియా వ్యవహారాలను శ్రీనివాస్ కోనేరు, శ్రీధర్ అప్పసాని నిర్వహించారు.
స్థానికంగా ప్రసిద్ధి పొందిన ప్రవాసాంధ్రులు శైలజ అడ్లూరి, హరి తుమ్మల, సతీష్ దాసరి, రవి ధన్నపునేని, గన్నె రమణ, జయ ప్రకాశ్, శ్రీనాథ్ ధూళిపాళ్ళ, భాస్కర్ భూపతి, రాజా తుమ్మల, రవి పొట్లూరి, శ్రీనివాస్ భరతవరపు, ప్రశాంత్ వేముగంటి, కృష్ణ ప్రసాద్ సుంకర, సత్య కలగోట్ల తదితరులు నాట్స్ వైద్య శిబిరానికి హాజరై సంస్థ సేవలను కొనియారు. అమెరికా వచ్చిన తల్లిదండ్రులు శిబిరంలో అందించిన సేవలకు ముగ్ధులయ్యారు.
నాట్స్ ఉచిత వైద్య శిబిరంలో విజయవంతం కావడానికి చక్కని సేవలు అందించిన నిపుణులైన వైద్యులకు, అలుపెరుగకుండా సేవలు చేసిన వలంటీర్లకు మోహన్ కృష్ణ మన్నవ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం డాక్టర్ మధు కొర్రపాటి మాట్లాడుతూ, ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను ఫిలడెల్ఫియా, న్యూయార్క్ ప్రాంతాల్లో కూడా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలంటే http://natsworld.org/new వెబ్ సైట్ లో చూడవచ్చని తెలిపారు.
NATS Free Medical Camp in NJ
Pages: -1- 2 News Posted: 24 February, 2010
|