టిఎల్ సిఎ సహృదయత
గంగామణి భర్త తమ ఇద్దరి పాస్ పోర్టులను ఫ్లషింగ్ లోని బ్యాంకు లాకర్లో భద్రపరిచారు. అయితే, బ్యాంకు రికార్డులలో గంగామణి పేరును నామినీగా పేర్కొనడం మరిచిపోయారు. బ్యాంకు లాకర్ తాళంచెవి తన దగ్గర ఉన్నప్పటికీ గంగామణి పేరు ప్రస్తావించకపోవడంతో లాకర్ తెరిచేందుకు బ్యాంకు అధికారులు తిరస్కరించారు. ఈ విషయమై వెంకటేశ్ ముత్యాల బ్యాంకు మేనేజర్ తో సంప్రతింపులు జరిపారు. ముందు బ్యాంకు లాకర్ తెరిచేందుకు ఆయన నిరాకరించారు. అయితే గంగామణి ఇబ్బందుల గురించి బ్యాంకు మేనేజర్ కు వెంకటేశ్ వివరంగా చెప్పి ఒప్పించారు. బ్యాంకు లాకర్ తెలవాలంటే క్వీన్స్ కంట్రీ కోర్టు నుంచి ఆర్డర్ తీసుకురావాలని మేనేజర్ సూచించారు.
దీనితో కొందరు న్యాయవాద మిత్రులను వెంకటేశ్ సంప్రతించి ఒక న్యాయవాదిని నియమించారు. ఆ లాయర్ గంగామణికి ఎదురైన ఇబ్బందులపై సవివరమైన అఫిడవిట్ ను క్వీన్స్ కంట్రీ సుప్రీం కోర్టు పబ్లిక్ అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్ లో దాఖలు చేయించారు. గంగామణి అఫిడవిట్ ను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతంర గంగామణి భర్త లాకర్ ను తెరిచి ఆమెకు ఆమె పాస్ పోర్టును అందజేయాలని పబ్లిక్ అడ్మినిస్ట్రేటర్ బ్యాంకు మేనేజర్ కు ఆర్డర్ ఇచ్చారు. ఆమె భర్త ఖాతాలో ఏదైనా కొద్దిగా సొమ్ము మిగిలి ఉంటే దాన్ని గంగామణి ఇచ్చిన ఇండియన్ బ్యాంకు ఖాతాలో పబ్లిక్ అడ్మినిస్ట్రేటర్ కార్యాలయం జమచేస్తుందని చెప్పారు.
అనంతరం తన భర్తకు గ్యాస్ స్టేషన్ యాజమాన్యం ఇచ్చిన మూడు జీతం బాపతు చెక్కులను బ్యాంకులో జమ చేయడం మరిచిపోయారని, తాను వాటిని జమచేసేందుకు వెళితే బ్యాంకు వారు తిరస్కరించినట్లు వెంకటేశ్ ముత్యాలకు తెలిపారు. వాటిని తన భర్త పనిచేసిన గ్యాస్ స్టేషన్ యాజమాన్యానికి తిరిగి ఇచ్చివేసి వాటికి బదులుగా డబ్బులు ఇవ్వాలని ప్రాధేయపడ్డారు. అయితే, సంస్థ యజమాని చెక్కులు తీసుకొని నెల రోజులుగా డబ్బులు చెల్లించలేదు. ఈ విషయమై కూడా వెంకటేశ్ ముత్యాల గ్యాస్ స్టేషన్ జనరల్ మేనేజర్ తో సంప్రతించి గురువారంనాడు ఆ డబ్బులు గంగామణికి చెల్లించేలా కృషిచేశారు.
ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటున్న గంగామణి కుమార్తె మరో దుర్వార్తను వెంకటేశ్ కు ఫోన్ చేసి చెప్పారు. గంగామణి భర్త మరణించిన కొద్ది రోజులకే గంగామణి అత్తగారు మరణించారు. ఈ విషయం తన తల్లికి చెప్పవద్దని గంగామణి కుమార్తె విజ్ఞప్తి చేశారు.
తన విజ్ఞప్తికి స్పందించి ఉదారంగా విరాళాలు అందజేసిన మిత్రుల సహకారంతో గంగామణికి ఫిబ్రవరి 20 శనివారం హైదరాబాద్ వరకూ విమానం టిక్కెట్ కొని వెంకటేశ్ ముత్యాల పంపించారు. ఖర్చులు పోగా మిగిలిన సొమ్మును ఆమెకే ఇచ్చివేశారు. ప్రస్తుతం గంగామణి తన సొంత ఊరికి క్షేమంగా చేరుకున్నారు. ఇబ్బందుల్లో ఉన్న గంగామణికి సాయం చేసిన ప్రతి ఒక్కరికీ వెంకటేశ్ ముత్యాల పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
Pages: -1- 2 News Posted: 26 February, 2010
|