సిటిఎ వార్షికోత్సవం

సిటిఎ కార్యనిర్వాహక కమిటీకి, వలంటీర్లకు తాజా మాజీ ప్రెసిడెంట్ ప్రసాద్ తళ్ళూరు కృతజ్ఞతలు తెలిపారు. వీరందరి సహకారం వల్లే సంస్థ చక్కని కార్యక్రమాలని విజయవంతంగా నిర్వహించగలిగిందన్నారు. సిటిఎ నూతన అధ్యక్షునిగా తనను నియమించినందుకు విజయ్ వెనిగళ్ళ సంస్థ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. అమెరికాలోని తెలుగువారి సేవకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనపై పూర్తి విశ్వాసం ఉంచి సిటిఎ సంస్థ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరినీ ఆయన అభివందనాలు తెలిపారు. సిటిఎ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి విజయ కొండూరు 'తెలుగు ఫెస్టివల్ ప్లానింగ్ కమిటీ'ని ప్రకటించారు. సిటిఎ కార్యదర్శి ప్రవీణ్ భూమన సంస్థ 2010 సంవత్సరపు ఎజెండాను వెల్లడించారు.
సిటిఎ నూతన కార్యవర్గం :
విజయ్ వెనిగళ్ళ - ప్రెసిడెంట్
శ్రీమతి విజయ కొండూరు - వైస్ ప్రెసిడెంట్
ప్రవీణ్ భూమన - కార్యదర్శి
లక్ష్మీనారాయణ తాతినేని - కోశాధికారి
నాగార్జున గుప్త - సంయుక్త కోశాధికారి
గోపి ఆచంట - ఇండియా కో ఆర్డినేటర్
తెలుగు ఫెస్టివల్ 2010 కో ఆర్డినేషన్ కమిటీ :
ఫణి రామినేని - కో ఆర్డినేటర్
శ్రీనివాస్ చుండు - డిప్యూటీ కో ఆర్డినేటర్.
సిటిఎ నిర్వహించే 2010 సంవత్సరపు కార్యక్రమాలు :
మార్చి 2010 - విమెన్స్ డే ఈవెంట్
ఏప్రిల్ - కిడ్స్ అకాడమీ వర్క్ షాప్
మే - కమ్యూనిటీ స్పోర్ట్ ఈవెంట్
జూన్ - కిడ్స్ సమ్మర్ క్యాంప్ ఈవెంట్
జూలై - తెలుగు ఫెస్టివల్ 2010
ఆగస్టు - క్యాంపింగ్ ఈవెంట్
సెప్టెంబర్ - ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఈవెంట్
అక్టోబర్ - గాంధీ జయంతి
నవంబర్ - హెల్త్ క్యాంప్ / వర్క్ షాప్
డిసెంబర్ - ఫైనాన్షియల్ ప్లానింగ్ వర్క్ షాప్.
Pages: -1- 2 News Posted: 3 March, 2010
|