ఇట్స్ ఎ గ్రేట్ హానర్ : హరి
అధ్యక్షోపన్యాసకులైన సప్తగిరి డైరెక్టర్ డాక్టర్ పాలకుర్తి మధుసూదనరావు మాట్లాడుతూ, ఇవి చాలా గొప్ప పురస్కారాలనీ, రెండేళ్ల క్రితం తాను కూడా ఈ పురస్కారం అందుకున్నాననీ, డిటిఎ ను నిర్వహిస్తున్న వారంతా బ్రహ్మర్షులు వంటివారనీ ప్రశంసించారు. ప్రతి సంవత్సరం ఇలాగే తెలుగు వారి ప్రతిభాపాటవాలను గుర్తించి పురస్కారాలు అందజేయాలని కోరుకుంటున్నాననీ, మన తెలుగు సంస్కృతి జెండాను భారతదేశమంతటా రెపరెపలాడించాలని ఆశిస్తున్నానీన అన్నారు. భారతీయ సంస్కృతిలో తెలుగు సంస్కృతి అవిభాజ్యమైన జీవనదిలాంటిదని ఎం.నర్సింహప్ప (ఐఆర్ఎస్) అభివర్ణించారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని సన్మానించడం ద్వారా తమ వంతు సామాజిక బాధ్యతను నిర్వహిస్తున్న డిటిఎ కృషి అభినందనీయమని కొనియాడారు. తెలుగు భాష, తెలుగు వారి కోసం డిటిఏ చేస్తున్న సేవలు శ్లాఘనీయమని, ప్రధాన కార్యదర్శి నాగరాజు అభినందనీయుడనీ సుధీష్ రాంబట్ల పేర్కొన్నారు. సభ ప్రారంభంలో వినోద్ బాబు, రమణి భరద్వాజ్ ల సంగీత్ సితార్ ఆహూతులను అలరించింది.
http://www.telugupeople.com/uploads/tphome/images/2010/dta4.jpg' align='center' alt=''>
Pages: -1- 2 News Posted: 22 March, 2010
|