తానా ఎన్నికల షెడ్యూల్
వాషింగ్టన్ : తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) కొత్త కమిటీ ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించారు. ప్రతిష్టాత్మకమైన ఈ సంస్థలో ఇరవై వేల మందికి పైగా సభ్యులున్నారు. జూలై 2009 నుంచి జూలై 2011 వరకూ అధికారంలో ఉండే ఈ సంస్థ కొత్త కమిటీ ఎన్నికల షెడ్యూల్ ను తానా ఎన్నికల కమిటీ చైర్మన్ డాక్టర్ కట్టమంచి ఉమాపతిరెడ్డి ప్రకటించారు. తానాలో వోటు అర్హత ఉన్న సభ్యులందరికీ మార్చి 22 లోగా ఎన్నికల కమిటీ చైర్మన్ బ్యాలట్ పేపర్లను పంపిణీ చేస్తారని తానా అధ్యక్షుడు (ఎలెక్ట్) జయరామ్ కోమటి ఒక ప్రకటనలో తెలిపారు. సభ్యులు బ్యాలట్ పేపర్లపై తమకు నచ్చిన అభ్యర్థులకు వోటు చేసి ఏప్రిల్ 4వ తేదీలోగా వాటిని కమిటీకి తిప్పి పంపిచాల్సి ఉంటుందన్నారు. ఏప్రిల్ 18న ఈ ఎన్నికల ఫలితాలు వెలువడతాయన్నారు.
కొత్తగా ఎన్నికయ్యే కమిటీ సభ్యులతో సహా ఇటీవలే తానాకు అధ్యక్షునిగా ఎన్నికైన జయరామ్ కోమటి ఈ సంవత్సరం జూలై 4న షికాగోలో జరిగే తానా సమావేశంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. 2001 వరకూ తానా కొత్త కమిటీ బాధ్యతలు నిర్వర్తిస్తుంది.
- ఎన్నికల షెడ్యూల్ ఇదీ :
- నామినేషన్ల దాఖలు : 2009 ఫిబ్రవరి 20 శుక్రవారం
- నామినేషన్ల జాబితా ప్రకటన : 2009 ఫిబ్రవరి 27 శుక్రవారం
- ఈ మెయిల్ ద్వారా నామినేషన్ల ఉపసంహరకు తుది గడువు : 2009 మార్చి 06 శుక్రవారం
- పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటన (వెబ్ సైట్ ద్వారా) తేదీ : 2009 మార్చి 09 సోమవారం
- వోటు హక్కున్న సభ్యులకు బ్యాలట్ల పంపిణీ తేదీ : 2009 మార్చి 22 ఆదివారం
- బ్యాలట్ పత్రాలు ఎన్నికల కమిటీకి తిరిగి చేరాల్సిన తుది గడువు : 2009 ఏప్రిల్ 4 శనివారం
- వోట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన తేదీ : 2009 ఏప్రిల్ 18 శనివారం.
News Posted: 21 February, 2009
|