ఫ్రీమాంట్ లో లింగార్చన
ఫ్రీమాంట్: కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్ లో మహా శివరాత్రి నాడు సహస్ర లింగార్చన నిర్వహించారు. రఘు మల్లాది, చింతపల్లి వెంకటేశ్వర శర్మ, భాస్కర శర్మ ఆధ్వర్యంలో శివరాత్రి ఉత్సవాలు మహా గణపతి పూజతో ప్రారంభమయ్యాయి. సహస్ర లింగార్చన, మహా రుద్రాభిషేకం, జ్యోతిర్లింగార్చన మొదలైన కార్యక్రమాలను భక్తిప్రపత్తులతో లింగోద్భవ కాలం వరకు నిర్వహించారు. తర్వాత సహస్ర నామార్చన, మహామంగళ హారతితో శివరాత్రి కార్యక్రమాలు ముగిశాయి.
ఉదయం 8 గంటల నుంచే ఏర్పాట్లు మొదలయ్యాయి. భక్తులందరూ పుట్టమన్నుతో సహస్ర లింగాలు తయారుచేసి. మట్టి ప్రమిదలతో మహా జ్యోతిర్లింగాలను ఏర్పాటుచేశారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 500 మంది భక్తులు హాజరయ్యారు. రవి గుడాంటి, కళ్యాణ్ ముద్దు, శ్రీకాంత్, అనిల్ అన్నం, రామ్ కిషోర్ ఇంకా అనేకమంది భక్తులు కార్యక్రమ నిర్వహణలో సహకరించారు.

News Posted: 26 February, 2009
|