ఎన్నారై పిఆర్పీ 'కాల్ ఎ థాన్'
వాషింగ్టన్ : వచ్చే ఎన్నికల్లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ప్రచారాన్ని ప్రవాస చిరంజీవి ఆర్గనైజేషన్ 'కాల్ ఎ థాన్', 'ఇ మెయిల్' ద్వారా చేపడుతున్నట్లు ప్రవాస చిరంజీవి ఆర్గనైజేషన్, ఎన్నారై ప్రజారాజ్యం పార్టీ విభాగం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. 'వోటర్లను ప్రభావితం చేయగలమా?, తప్పకుండా' అంటూ ప్రవాస చిరంజీవి ఆర్గనైజేషన్ ఉపాధ్యక్షుడు, అధికార ప్రతినిధి శ్రీనివాస మానాప్రగడ ఒక ప్రకటనలో విశ్వాసం వ్యక్తం చేశారు. అమెరికా, కెనడా, బ్రిటన్, సింగపూర్, మలేసియా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల్లోనే కాకుండా ప్రపంచంలో అనేక చోట్ల తన విభాగాలు నెలకొల్పిన ప్రవాస చిరంజీవి ఆర్గనైజేషన్ వోటర్లను ప్రభావితం చేస్తూ 'కాల్ ఎ థాన్', 'ఇ మెయిల్' విధానాల్లో విజ్ఞప్తులు చేసేందుకు సమాయత్తం అయింది. ఈ విధానం ద్వారా తమకు తెలిసిన కుటుంబాలు, స్నేహితులు, శ్రేయోభిలాషులను ప్రవాస చిరంజీవి ఆర్గనైజేషన్ ప్రభావితం చేయడం ద్వారా ప్రజారాజ్యం పార్టీ పట్ల ఆసక్తి, అవగాహన కల్పిస్తుందని శ్రీనివాస మానాప్రగడ తన ప్రకటనలో వివరించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మంచి ప్రభావం చూపెట్టిన 'మార్పు' నినాదంతో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధే ధ్యేయంగా ముందుకు వచ్చిన ప్రజారాజ్యం పార్టీ అనుకూలంగా వారి వారి విలువైన వోట్లను వేసేలా ఈ సంస్థ కృషి చేస్తుంది.
కాల్ ఎ థాన్, ఇ మెయిల్ ద్వారా ఎన్నారైలు ప్రతి ఒక్కరూ తమకు తెలిసిన కుటుంబాలు, మిత్రులకు విజ్ఞప్తి చేసి ప్రజారాజ్య పార్టీకి అఖండ మెజారిటీ తీసుకురావడంలో చేయూతనివ్వాల్సిందిగా ప్రవాస చిరంజీవి ఆర్గనైజేషన్, ఎన్నారై ప్రజారాజ్యం పార్టీ విభాగం తన ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. ఈ ప్రచారం కోసం మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ క్రింది ఇ మెయిల్ చిరునామాల్లో సంప్రతించవచ్చు.
Email: sseera@gmail.com - Los Angles
manapragada@gmail.com - Bay Area
rajaniakurati@yahoo.com - Chicago
srikanth.palivela@gmail.com -Bay Area
krishnamurtyp@yahoo.com - Boston
kalyan_palla@yahoo.com - India and Bay Area,
USA
vadranam2001@yahoo.com - Atlanta
bandiraghu@yahoo.com - East Coast USA
News Posted: 3 March, 2009
|