అట్లాంటా : అమెరికాలో మరో ఆంధ్ర యువకుడు అర్ధంతరంగా అసువులుబాసాడు. హైదరాబాద్ లోని హబ్సిగూడకు చెందిన ధీరజ్ అనే యువకుడు శుక్రవారం ఉదయం మార్నింగ్ వాక్ కు వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొన్నది. ధీరజ్ ను ఢీకొన్న వాహనాన్ని ఆపకుండా సంఘటనా స్థలం నుంచి వేగంగా వెళ్ళిపోయింది. ఈ ప్రమాదంలో ధీరజ్ అక్కడికక్కడే మరణించాడు. ధీరజ్ తల్లిదండ్రులు హబ్సిగూడలో నివాసం ఉంటున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.