మేలో ఇయానా సమ్మర్ పిక్నిక్
కాలిఫోర్నియా : ఇండియన్ యూత్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (ఐవైఏఎన్ఏ) ఈ సంవత్సరపు సమ్మర్ పిక్నిక్ ను మే నెల 30 నిర్వహిస్తున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, పిక్నిక్ వేదిక తదితర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలిపింది. చిన్నారులకు చక్కని వేసవి ఆటవిడుపుగా ఉండే ఇయానా సమ్మర్ పిక్నిక్ లో పెద్దలు, చిన్నారులు అందరికీ చక్కని వినోదాన్నిచ్చే ఔట్ డోర్ గేమ్స్ లాంటి పలు అంశాలు నిర్వహించనున్నట్లు ఇయానా తెలిపింది. ఈ పిక్నిక్ లో ఆహారపదార్థాల్లో భాగంగా దక్షిణ భారత దేశంలో ప్రాచుర్యం పొందిన 'దోశ'లను కూడా సరఫరా చేయనున్నట్లు పేర్కొంది. ఎన్నెన్నో కార్యక్రమాలతో అందరినీ అలరంచే విధంగా నిర్వహించే సమ్మర్ పిక్నిక్ లో అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవతం చేయాలని ఇయానా తన ప్రకటనలో తెలిపింది.
News Posted: 13 March, 2009
|