సిలికానాంధ్ర ఉగాది ఉత్సవం
కాలిఫోర్నియా : శ్రీ విరోధి నామ సంవత్సర ఉగాది ఉత్సవాన్ని మార్చి 28న వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సిలికానాంధ్ర సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. సన్నీవేల్ హిందూ దేవాలయంలో ఆ రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకూ పిల్లలకు తెలుగు భాషా వికాస పోటీలు బాల గేయ గాంధర్వం, పదహారణాల తెలుగు భోజనం, కవితా తాంబూలం లాంటి పలు పసందైన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు సిలికానాంధ్ర సంస్థ వెల్లడించింది.
పిల్లల తెలుగుభాషా వికాస పోటీలు, వేపపువ్వు పచ్చడి సరఫరా, పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, ఉగాది పద్యాలు, చిత్ర కవితలు, చిన్నారులు సుమధురంగా పాడి అందరినీ అలరింపజేసే బాల గేయ గాంధర్వం, పసైందైన పదహారణాల తెలుగు భోజనం, కవితా తాంబూలం లాంటి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. అందరం కలిసి ఉత్సాహంగా తెలుగు కొత్త సంవత్సరాన్ని ఆనందంగా నిర్వహించుకునేందుకు అందరికీ సిలికానాంధ్ర సంస్థ సాదరంగా స్వాగతం పలికింది.
కార్యక్రమం వివరాలు :
2009 మార్చి 28
ఉదయం 11 గంటలకు పిల్లల తెలుగుభాషా వికాస పోటీలు
సాయంత్రం 5 గంటలకు కవి సమ్మేళనం, బాలగేయ గాంధర్వం
రాత్రి 8 గంటలకు పదహారణాల తెలుగు భోజనం.
స్థలం : సన్నీవేల్ హిందూ దేవాలయం
ఇతర వివరాలు కావాల్సిన వారు
కవిత నరాల
ఫోన్ : 408 603 7734
ఈ మెయిల్ : kavitha@siliconandhra.org
మానసరావు అద్దేపల్లి
ఫోన్ : 510 659 0824
ఈ మెయిల్ : manasa@siliconandhra.org
నుంచి తెలుసుకోవచ్చు.
News Posted: 13 March, 2009
|